Tonsillitis Symptoms: టాన్సిల్స్ ప్రారంభ లక్షణాలెలా ఉంటాయి, ఎలా గుర్తు పట్టవచ్చు

Tonsillitis Symptoms: ఇటీవలి కాలంలో టాన్సిల్స్ లేదా టాన్సిలైటిస్ సమస్య పెరుగుతోంది. సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే సర్జరీ వరకూ వెళ్లవచ్చు. టాన్సిల్స్ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి, సకాలంలో ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 12:04 PM IST
Tonsillitis Symptoms: టాన్సిల్స్ ప్రారంభ లక్షణాలెలా ఉంటాయి, ఎలా గుర్తు పట్టవచ్చు

Tonsillitis Symptoms: టాన్సిల్స్ అనేది గొంతులో ఏర్పడే సమస్య. టాన్సిల్స్ ఉంటే గొంతులో నొప్పితో పాటు చాలా అసౌకర్యంగా ఉంటుంది. భోజనం తినడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు. ముద్గ మింగడంలో సైతం కష్టంగా ఉంటుంది. ఎంత సాధారణ సమస్యో..నిర్లక్ష్యం వహిస్తే అంత సీరియస్ కాగలదు.

టాన్సిల్స్ లేదా టాన్సిలైటిస్ అనేది గొంతు లోపలి భాగంలో గుడ్డు ఆకారంలో ఏర్పడే ప్యాడ్ లాంటిది. ఇదొక ఈఎన్టీ సమస్య. టాన్సిల్స్ ఏర్పడినప్పుడు స్వెల్లింగ్, నొప్పి అధికంగా ఉంటుంది. టాన్సిల్స్ అనేది డిఫెన్స్ మెకానిజం రూపంలో పనిచేస్తుంది. శరీరంలోకి ఏ విధమైన సంక్రమణ సోకకుండా అడ్డుకుంటుంది. టాన్సిల్స్ అనేది సాధారణంగా చిన్నారుల్లో ఎక్కువగా వచ్చినా అన్ని వయస్సులవారికీ సంక్రమిస్తుంది. టాన్సిల్స్‌కు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్.

టాన్సిలైటిస్ అంటే ఏమిటి

శరీరానికి రక్షణ కల్పించడంలో టాన్సిల్స్ కీలకపాత్ర పోషిస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా వ్యాదులు సోకకుండా పోరాడతాయి. ముక్కు, నోరు ద్వారా సంక్రమించే వైరస్ లేదా బ్యాక్టీరియాను ఈ టాన్సిల్స్ ఎదుర్కొంటాయి. అదే సమయంలో టాన్సిల్స్ కూడా సంక్రమించగలవు. వైరస్ లేదా బ్యాక్టీరియాతో సంక్రమించగలవు. సెప్టికోకల్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవి టాన్సిల్ సంక్రమణకు కారణం. ఇది సమస్యను మరింతగా పెంచుతుంది. 

టాన్సిలైటిస్ లక్షణాలు

టాన్సిల్స్‌ను సకాలంలో గుర్తిస్తే చాలా సులభంగా చికిత్స చేయించుకోవచ్చు. అదే ఆలస్యమైతే సర్జరీ వరకూ పరిస్థితి వెళ్తుంది. అందుకే కొన్ని లక్షణాల ద్వారా టాన్సిల్స్‌ను సులభంగానే గుర్తించవచ్చు. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే సులభమైన మందుల ద్వారా సమస్య పరిష్కారమౌతుంది.

గొంతులో స్వెల్లింగ్, నొప్పి విపరీతంగా ఉంటాయి. టాన్సిల్స్ ఏర్పడితే గొంతు లోపల ఎర్రగా ఉండవచ్చు. జ్వరం వస్తుంటుంది. టాన్సిల్స్‌పై పసుపు లేదా తెలుపు కోటింగ్ ఉంటుంది. తలనొప్పి బాధిస్తుంది. నోటి పూత సమస్య ఏర్పడుతుంది. చెవిలో నొప్పి బాధిస్తుంది. మెడ పట్టేసినట్టుంటుంది. గొంతు నొక్కేసినట్టు వాయిస్ ఉంటుంది. చలిజ్వరం, తిండి తినడంలో ఇబ్బంది ఏర్పడతాయి. ఇక పిల్లలో అయితే వాంతులు,  చెల్లు కారడం, కడుపు నొప్పి, కడుపు పాడవడం కన్పిస్తుంది.

Also read: Blood Purifying Foods: రక్తాన్ని క్షణాల్లో ప్యూరిఫై చేసే 4 సహజసిద్ధమైన పదార్దాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News