Blood Sugar Test: బ్లడ్ షుగర్ పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవడం మంచిది

Blood Sugar Test: ఆధునిక జీవన విధానంలో వెంటాడుతున్న ప్రధాన సమస్య డయాబెటిస్. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఈ వ్యాధికి ప్రధాన కారణం. అందుకే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2023, 07:00 PM IST
Blood Sugar Test: బ్లడ్ షుగర్ పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవడం మంచిది

Blood Sugar Test: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికీ సరైన చికిత్స లేదు కానీ నియంత్రణ మాత్రం సాధ్యమే. డయాబెటిస్ ఎంత ప్రమాదకరమైందంటే..నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. ఇతర వ్యాధులకు కారణమౌతుంది. 

మధుమేహాన్ని అందుకే సైలెంట్ కిల్లర్ వ్యాధిగా పరిగణిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఒక్కోసారి మధుమేహం వ్యాధి లక్షణాలను గ్రహించడం కూడా కష్టమౌతుంది. ప్రారంభ లక్షణాలు గుర్తించలేకపోతుంటారు. కారణం ఆ లక్షణాలు చాలా సందర్భాల్లో సూక్ష్మంగా ఉంటాయి. ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తామో క్రమేపీ గుండె వ్యాధి, కిడ్నీ వ్యాధులకు కారణమౌతుంది. అందుకే ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి రోజూ బ్లడ్ షుగర్ పరీక్ష చేసుకోవడం వల్ల మనం తినే ఆహార పదార్ధాలతో గ్లూకోజ్ స్థాయి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఉదయం వేళ పరగడుపున సేకరించిన రక్త పరీక్ష కచ్చితమైన ఫలితాలనిస్తుందంటారు. ఆ సమయంలో కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటే మంచిది. అప్పుడే సరైన ఫలితం గమనించవచ్చు. దీనినే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటారు. రక్తంలో చక్కెర స్థాయి ఏ మేరకు ఉందో అంచనా వేసేందుకు ఈ పరీక్ష అవసరం. 

భోజనానికి ముందు రక్త పరీక్ష అనేది ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలనేది నిర్ణయించేందుకు దోహదపడుతుంది. దీనివల్ల మనం తీసుకునే ఆహార పదార్ధాలు లేదా మందులు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకునేందుకు సహాయమౌతుంది. అదే విధంగా టైప్ 2 డయాబెటిస్ ఉంటే మాత్రం భోజనానికి ముందు, తరువాత, రాత్రి నిద్రకు ముందు మూడుసార్లు పరీక్షించుకోవాలి.

ఉదయం అల్పాహారానికి ముందు అంటే పరగడుపున, వ్యాయామం చేసిన తరువాత, రాత్రి పడుకునే ముందు ఇలా మూడుసార్లు చక్కెర స్థాయి పరీక్షించుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు వివిద సందర్భాల్లో రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో డయాబెటిస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ప్రభావితమౌతున్నాయో అర్ధమౌతుంది.

Also read: Kidneys Care: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే చాలు, కిడ్నీలు సూపర్ క్లీన్ అవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News