Paediatric Cancer: పీడియాట్రిక్ కేన్సర్ ఎంతవరకూ ప్రమాదకరం, ఎలా నిర్ధారించవచ్చు

Paediatric Cancer: ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో పీడియాట్రిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అసలు పీడియాట్రిక్ కేన్సర్ అంటే ఏమిటి, ఎంతవరకూ ప్రమాదకరమనే వివరాలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 06:56 PM IST
Paediatric Cancer: పీడియాట్రిక్ కేన్సర్ ఎంతవరకూ ప్రమాదకరం, ఎలా నిర్ధారించవచ్చు

Paediatric Cancer: పీడియాట్రిక్ కేన్సర్ అనేది చాలా ప్రమాదకరమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్ని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 4 లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. పీడియాట్రిక్ కేన్సర్ కారణంగా చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.

పీడియాట్రిక్ కేన్సర్ సోకితే 80 శాతం చికిత్స సాధ్యమే కానీ త్వరగా గుర్తించగలిగితేనే ఇది సాధ్యమౌతుంది. సరిగ్గా గుర్తించలేకపోతే లేదా ఆలస్యంగా గుర్తిస్తే వ్యాధి ముదిరిపోతుంది. చికిత్స మధ్యలో నిలిపివేయడం, టాక్సిసిటీ, రీల్యాప్స్ వల్ల మరణానికి దారితీయవచ్చు. పిల్లలు, కౌమారదశలో సాధారణంగా కన్పించేది ల్యుకేమియా 24.7 శాతముంటుంది. ట్యూమర్, నాడీ వ్యవస్థలో 17.2 శాతం, నాన్ హాకింగ్ లింఫోమా 7.5 శాతం, హాకింగ్ లింఫోమా 6.5 శాతం, సాఫ్ట్ టిష్యూ సర్కోమా 5.9 శాతం ఉంటుందని అద్యయనాలు చెబుతున్నాయి. 

పీడియాట్రిక్ కేన్సర్ గుర్తించేదుకు చాలా రకాల శాంపిల్స్ అవసరమౌతాయి. బ్లడ్, సీరమ్, బాడీ ఫ్లూయిడ్, టిష్యూ వంటివి సేకరిస్తారు. దీనివల్ల కేన్సర్ ఎలాంటిదో తెలుస్తుంది. దాంతోపాటు వ్యాధి ఏ స్థాయితో ఉందో తెలుసుకునేందుకు వీలవుతుంది. దాంతో చికిత్స సులభమౌతుంది. 

ల్యుకేమియా నేది పెరిఫెరల్ స్మియర్ లేదా బోన్ మారో యాస్పిరేషన్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత ఫ్లో సిమెట్రీ ఉంటుంది. ఇందులో ఫ్లోరోసెన్స్ లేబుల్డ్ యాంటీ బాడీస్ వినియోగిస్తారు. దీంతో ట్యూమర్ సెల్స్‌లో యాంటీజన్ కనుక్కోగలుగుతారు. ట్యూమర్ ఏ రకానిదో తెలుసుకోవచ్చు. ఇక సాలిడ్ ట్యూమర్ అయితే ఇమేజ్ గైడెడ్ బయాప్సీ చేస్తారు. ఆ తరువాత హిస్టోపైథోలాజికల్ పరీక్ష, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ చేస్తారు. అవసరమైతే వైద్యులు ట్యూమర్ సెల్స్‌లో జరిగే యాంటీజెన్స్‌ను అంచనా వేస్తారు.

పీడియాట్రిక్ ట్యూమర్స్ పాధోజెనెసిస్ ఎడల్ట్స్  నుంచి విభిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది సాధారణంగా సింగిల్ జెనెటిక్ డ్రైవర్ ఈవెంట్ నుంచి పుడుతుంది. ఇటీవలికాలంలో మాలిక్యులర్ క్లాసిఫికేషన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. జెనెటిక్ ఆల్ట్రేషన్ అధ్యయనం చేయకుండా ట్యూమర్స్ డయాగ్నోసిస్ అనేది అసంపూర్తి అని చెప్పవచ్చు. 

Fish ఇందులో ట్రాన్స్‌లొకేషన్ గురించి తెలుస్తుంది. ఇక  RTPCRలో ఫ్యూజన్ జీన్స్, పాయింట్ మ్యూటేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇక Next Generation Sequencingలో జెనెటిక్ ఆల్ట్రేషన్ స్డడీ తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా సీరమ్ ట్యూమర్ మేకర్స్ వినియోగిస్తారు. ఇందులో AFP, Beta HCG, Urine VMA ఉంటాయి

Also read: AP Bhavan Assets: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News