Uric Acid Alert: ఈ పదార్ధాలు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచేస్తాయి తస్మాత్ జాగ్రత్త

Uric Acid Alert: శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే గౌట్, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధుల ముప్పుు పెరుగుతుంది. ఫ్రక్టోజ్ నిండి ఉండే పదార్ధాల్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2023, 08:58 AM IST
Uric Acid Alert: ఈ పదార్ధాలు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచేస్తాయి తస్మాత్ జాగ్రత్త

Uric Acid Alert: ఇటీవలి కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలు, యువకులు అందరికీ జాయింట్ పెయిన్స్, గౌట్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. ఈ సమస్యకు  చాలా కారణాలున్నాయి.  ఆ కారణాలేంటి, ఎలా చెక్ పెట్టాలనేది తెలుసుకుందాం..

చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వయస్సు పెరగడం వంటి కారణాలతో శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో జాయింట్ పెయిన్స్, ఆర్ధరైటిస్ వంటి సమస్యలు ఎదురౌతాయి. యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో ఉండే ఓ చెడు పదార్ధం. ఆహారం జీర్ణంతో ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇందులో ప్యూరిన్ ఉంటుంది. శరీరంలో ప్యూరిన్ విరిగితే..యూరిక్ యాసిడ్ ఉత్పన్నమౌతుంది.

యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు అధికంగా ఉంటే..గౌట్, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పదార్దాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఎలాంటి పదార్ధాలతో యూరిక్ యాసిడ్ పెరుగుతుందో తెలుసుకుందాం..

పనస పండు:

పనస పండు వాస్తవానికి చాలా ఆరోగ్యకరమైంది. కానీ ఓ అధ్యయనం ప్రకారం ఒక కప్పు పనస తొనల్లో 15.2 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. 

ద్రాక్ష:

ద్రాక్షలో విటమిన్ సి , ఫైబర్‌తో పాటు ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు ద్రాక్షలో 12.3 గ్రాముల ఫ్రక్టోజ్ లభిస్తుంది. ఇది కాకుండా..ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, రెట్రో వైరల్, క్వేర్‌సెటిన్ ఉంటాయి.

కిస్మిస్:

కిస్మిస్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. అయితే ఒక ఔన్సు కిస్మిస్‌లో 9.9 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది ఆర్ధరైటిస్ సమస్యను పెంచుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవాళ్లు కిస్మిస్ తినకూడదు.

యాపిల్:

యాపిల్‌లో కూడా ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక యాపిల్‌లో 12.5 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆర్ధరైటిస్ లేదా యూరిస్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లు యాపిల్ తక్కువగా తినడం మంచిది. 

అరటి:

అరటిలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ భారీగా ఉంటాయి. కానీ ఇందులో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అరటిలో దాదాపుగా 5.7 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆర్ధరైటిస్ రోగులకు ఇది హానికరం.

Also read: Arthiritis Home Remedies: ‌ కిచెన్‌లో లభించే వస్తువులతోనే ఆర్ధరైటిస్ వంటి గంభీర వ్యాధులకు చెక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News