Swelling in Legs: కాళ్లలో వాపు కారణంగా నడవడం కష్టమవుతుందా? అయితే ఈ 3 విధాలుగా ఆయిల్ మసాజ్ చేయండి

Swelling in Legs: పాదాల్లో వాపు ఉంటే చాలా నొప్పిగా ఉంటుంది. అయితే ఆవాల నూనెలో కొన్ని పదార్థాలను కలిపి రాసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 02:26 PM IST
Swelling in Legs:  కాళ్లలో వాపు కారణంగా నడవడం కష్టమవుతుందా? అయితే ఈ 3 విధాలుగా ఆయిల్ మసాజ్ చేయండి

Oils For Swelling in Legs: గాయం కారణంగా నరాలు లాగడం ప్రారంభించినప్పుడు పాదాలు వాచడం (Swelling in Legs) సాధారణం. వాపు తర్వాత, చాలా నొప్పి ఉంటుంది, నడవడం కూడా కష్టం అవుతుంది. చాలా సార్లు వేడి కట్టు కట్టడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కానీ అలా చేయడం వల్ల మంట కూడా వస్తుంది. పాదాల వాపుకు మెడిషన్ తీసుకోవడం ద్వారా కూడా నయం చేయవచ్చు. మీరు అవి వాడటం ఇష్టం లేకపోతే ఇంటి రెమిడీస్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పాదాల వాపు తగ్గడానికి ఆవాల నూనె (Mustared Oil) ఎంతో బాగా పనిచేస్తుంది. 

1. మస్టర్డ్ ఆయిల్-పసుపు (Mustard Oil with Turmeric)
ఆవాల నూనెలో పసుపు (Turmeric) కలిపి, వాపు ఉన్న ప్రదేశాలలో మర్దన చేయాలి. పసుపులో యాంటీమైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు ఉన్నందున, ఇది నొప్పిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. 

2. మస్టర్డ్ ఆయిల్- లవంగం (Mustard Oil with Clove)
పాదాల వాపును తొలగించడానికి, కొన్ని లవంగాలను (Clove) ఆవాల నూనెలో వేసి తక్కువ మంటపై వేడి చేయండి. ఇప్పుడు ఈ నూనెను ఏ ప్రదేశంలో నొప్పి ఉందో అక్కడ మసాజ్ చేయండి. ఇది వాపును తొలగించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

3. మస్టర్డ్ ఆయిల్-అల్లం(Mustard Oil with Ginger)
ఒక పాత్రలో ఆవాల నూనె, అల్లం (Ginger) వేసి వేడి చేయండి. మీరు దానిని వాపు ఉన్న భాగాలలో బాగా రాయండి. దీంతో నొప్పి నుంచి వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది.

Also Read: Blood Increase Food: మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News