Health Tips: మీరు తరచూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడుతోంటే కొన్ని ఆహార పదార్ధాలను మీ డైట్‌లో భాగం చేసుకుని మీ పొట్టను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పదార్థాల వల్ల మీ పొట్ట నుంచి విషతుల్యాలు బయటికి వచ్చేస్తాయి.
Also Read | Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు
కలుషితమైన ఆహారం (Food) తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు. విషతుల్యమైన, అసురక్షితమైన పదార్ధాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వామిటింగ్, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లలో కేల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరెట్, సోడియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరం హైడ్రేడ్ ఉంటేలా చేస్తుంది. పొట్ట తేలికగా ఉంటుంది.
పెరుగు
పెరుగులో యాంటీబయోటిక్ తత్వాలు ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ ఉన్న సమయంలో ఇది ప్రయోజనాలు కలిగిస్తుంది. పెరుగులో కొద్దిగా ఉప్పు, చెక్కర వేసి రెగ్యులర్‌గా తీసుకోవాలి.
Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
వెల్లుల్లి
వెల్లుల్లిని భారతీయుల (Indian) వంటకాల్లో విరివిగా వినియోగాస్తారు. అయితే చాలా మందికి దాని ప్రయోజనం గురించి తెలియదు. వెల్లుల్లి వల్ల కడుపునొప్పి, విరోచనాలు తగ్గుతాయి. ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తొలగుతాయి
మెంతులు
మెంతులు తరచూ తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, వంటి సమస్యలు తొలుగుతాయి. ఫుడ్ పాయిజనింగ్ సమయంలో ఈ సమస్యలు తరచూ కలుగుతుంటాయి.
తులసి
తులసి వల్ల ఎన్ని ప్రయోజనాలో మనందరికి తెలిసిందే. సర్వరోగ నివారిణి అయిన తులసిని తరచూ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తగ్గుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe