Food To Eat Menstruation: నెలసరి లేదా పీరియడ్స్ అనేది ప్రతి మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో గర్భాశయం నుంచి రక్తం బయటకు వస్తుంది. ఇది ప్రతి నెల సుమారు 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. నెలసరి సమయంలో మహిళలు నీరసంగా ఉంటారు. దీంతో పాటు అససట, కడుపు నొప్ప, వెన్ను నొప్పులు వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
నెలసరి సమయంలో తినాల్సిన ఆహారాలు:
చాలా మంది నెలసరి సమయంలో జంక్ ఫూడ్, ఐస్ క్రీములు, అతిగా నూనెలో వేయించిన పదార్థాలు వంటి పదార్థాలు తింటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్లు చాలా మంచివి. అలాగే పప్పులు, గింజలు తినడం కూడా మంచిది. ఇందులో ప్రోటీన్, ఐరన్, పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పిన తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి.
పీరియడ్స్ సమయంలో పాల ఉత్పత్తులు తీసుకోవడం కూడా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో మేలు చేస్తాయి. చక్కెర తక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మూడ్ స్వింగ్స్, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తీపికి బదులుగా చిరుధాన్యాలతో తయారు చేసే పదార్ధాలు తీసుకోవడం చాలా మంచిది. నెలసరి సమయంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి నీరు చాలా ముఖ్యం. దీని వల్ల బాడీలో ఉండే అనవసరమైన పదార్థాలు బయటకు వెళ్తాయి.
నెలసరి సమయంలో తీసుకోకుండా ఉండాల్సిన ఆహారాలు:
పీరియడ్స్‌లో శరీరం అనేక మార్పులు కలుగుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు నొప్పి, వాపు మరియు ఇతర లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు. అందులో చక్కెర తీసుకోవడం వల్ల మానసిక స్థితిపైన తీవ్రమైన ప్రభావితం ఉంటుంది. కడుపు నొప్పిని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కేకులు, ఇతర మిఠాయిలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకుని, వాపును పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్, పిజ్జా ఇతర ఉప్పగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కాఫీ, ఆల్కహాల్ రెండూ మూత్రవిసర్జనను పెంచుతాయి, ఇది శరీరంలోని నీటిని కోల్పోవడానికి దారితీస్తుంది. ఇవి కడుపు నొప్పిని కూడా పెంచుతాయి. అతిగా నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ ఇతర కొవ్వు ఆహారాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి, కడుపు నొప్పిని పెంచుతాయి. బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు వంటి తృణధాన్యాలు వాయువును ఉత్పత్తి చేసి, అధికంగా తీసుకున్నప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
ముఖ్యమైన విషయాలు:
ప్రతి వ్యక్తికి నెలసరి లక్షణాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి, ఏ ఆహారాలు అనుకూలంగా లేవో గమనించడం ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం ముఖ్యం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి.
Disclaimer:
ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీ వైద్యుడిని సంప్రదించండి.
Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter