Healthy Heart: ఆ మూడు డ్రింక్స్ రోజూ తీసుకుంటే మీ గుండె పదికాలాలు పదిలం

Healthy Heart: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైంది గుండె ఆరోగ్యం. గుండె ఆరోగ్యం కోసం ఏ విధమైన డ్రింక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2022, 08:46 PM IST
Healthy Heart: ఆ మూడు డ్రింక్స్ రోజూ తీసుకుంటే మీ గుండె పదికాలాలు పదిలం

Healthy Heart: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైంది గుండె ఆరోగ్యం. గుండె ఆరోగ్యం కోసం ఏ విధమైన డ్రింక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..

శరీరంలో అన్నింటి కంటే ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆహారపు అలవాట్లు బాగుండాలి. హెల్తీ హార్ట్ కోసం ఆహారపు అలవాట్లు బాగుండటమే కాకుండా..హెల్తీ డ్రింక్స్ కూడా డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఈ డ్రింక్స్ సేవించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండెకు హాని కలుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని రకాల డ్రింక్స్‌ను మీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఆ డ్రింక్స్ ఏంటో చూద్దాం..

కేరట్, బీట్‌రూట్ జ్యూస్

కేరట్-బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కేరట్‌లో ఉండే బీటా కెరోటిన్ గుండెకు చాలా మంచిది. ప్రతిరోజూ కేరట్ - బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తశాతం పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాడీ పటిష్టంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

కీరా పుదీనా జ్యూస్

కీరా పుదీనా జ్యూస్ అనేది కడుపుకు చాలా మంచిది. ఈ జ్యూస్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు శరీరంలో ఫైబర్ మోతాదును పెంచుతుంది. కడుపును ఆరోగ్యంగా ఉంచడం, మల బద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఫైబర్ కీలకంగా ఉపయోగపడుతుంది. కీరా పుదీనా జ్యూస్ కడుపుకు చలవ చేస్తుంది. ఈ డ్రింక్‌ను నీళ్లతో కలుపుకుని తాగాలి.

సోంపు నీళ్లు

సోంపు నీళ్లు శరీరానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఇందులో విటమిన్ కే, విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా ఉపయోపడతాయి.

Also read: Massage Benefits: కాళ్ల నొప్పుల సమస్యకు అద్భుతమైన ఔషధం, ఆ నూనెతో మాలిష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News