Healthy Summer Drinks In Telugu: వేసవి కాలం మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భానుడు భగ భగ మండుతున్నాడు. మండుతున్న ఎండల కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లతో పాటు పెద్దవారు కూడా డీహైడ్రేటెషన్ సమస్యల బారిన పడతారు. అయితే ఇలాంటి సమస్య బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు సమ్మర్ కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
వేసవి ఎండలకు చల్ల చల్లని డ్రింక్స్:
1. నిమ్మ-పుదీనా జ్యూస్ (Lemon-Mint Juice):
ఈ నిమ్మ-పుదీనా జ్యూస్‌ని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసులో నిమ్మరసం, కొన్ని తాజా పుదీనా ఆకులు, కొంచెం సుగర్ సిరప్ వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు ఇష్టమైతే ఐస్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీంతో పాటు జీర్ణక్రియ బలంగా తయారవుతుంది.
2. మజ్జిగ (Buttermilk):
మజ్జిగ అనేది సంప్రదాయంగా వస్తున్న పానీయంజ.. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. దీని తయారీకి పెరుగు, నీరు, కొంచెం ఉప్పు కలపోతే సరిపోతుంది. అంతేకాకుండా ఇందులో అదనంగా పుదీనా ఆకులు లేదా వాము వేసి మరింత రుచి తెచ్చుకోవచ్చు.
3. రోజ్ మిల్క్ (Rose Milk):
రోజ్ మిల్క్ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. దీనిని తయారు చేయడం చాలా సులభం..ఒక గ్లాసు పాలల్లో కొంచెం రోజ్ మిల్క్ సిరప్ కలుపు కోవాల్సి ఉంటుంది. అందులోనే కావాలనుకుంటే కొన్ని గులాబి రేకులు వేసుకు మిక్స్ చేసుకుని తాగితే చాలు.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
4. పుచ్చకాయ జ్యూస్ (Watermelon Juice):
పుచ్చకాయ ఎండాకాలంలో లభించే రుచికరమైన పండు. దీని రసంలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గింజలు తీసివేసి, ముక్కలుగా కోసిన పుచ్చకాయ ముక్కలను మిక్సర్‌లో వేసి జ్యూస్‌లా తయారు చేసుకోండి. ఆ తర్వాత వడపోసి కొంచెం నీరు కలుపుకుని తాగండి.
5. ఖర్బూజా జ్యూస్ (Muskmelon Juice):
ప్రతి రోజు ఖర్బూజా జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎండ కారణంగా వచ్చే సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. దీనిని పుచ్చకాయ జ్యూస్ లాగే తయారు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter