4 Healthy & Light Breakfast for Energetic day: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్ బాగుండాలి. దీనికోసం 4 ముఖ్యమైన పదార్ధాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టే రోజంతా ఆధారపడి ఉంటుంది. ఉదయం వేళల్లో మసాలా పదార్ధాలు తినడం వల్ల గ్యాస్- ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. హెవీ బ్రేక్‌ఫాస్ట్ తిన్నా సమస్యే. అలాగని ఏం తినకుండా ఉండకూడదు. వీక్నెస్, ఎసిడీటీ ఏర్పడతాయి. మరి ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే 5 రకాల అల్పాహారాల్ని ఓసారి పరిశీలిద్దాం..
పోహా..
ఆరోగ్యంగా ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా మంచి ప్రత్యామ్నాయం. ఇది రుచికరమైందే కాకుండా తేలిగ్గా ఉంటుంది. త్వరగా జీర్ణమౌతుంది. పోహాను రుచికరంగా చేయాలంటే మనక్కాయ, కూరగాయలు, కరివేపాకు, నిమ్మరసం వేస్తే ఇంకా బాగుంటుంది. రోజూ ఇది తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలగడమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఉప్మా..
బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా కూడా చాలా మంచిది. నూకతో చేసే ఉప్మా కావడం వల్ల కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లతో ఉండే మినపపప్పును కూడా జోడించవచ్చు. దీంతో మరింత రుచి కలుగుతుంది. ఉప్మాలో కరివేపాకు, కూరగాయలు, ఆవాలు వేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుంది.
ఉతప్పం..
ఊతప్పం అనేది దక్షిణాది బ్రేక్‌ఫాస్ట్. ఇందులో మినపపప్పు, బియ్యం కలిగి ఉంటాయి. ఇది చేయడానికి సమయం కూడా ఎక్కువ పట్టదు. సాంబారు లేదా చట్నీతో తింటే రుచికరంగా ఉంటుంది. ఊతప్పం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి.
ఇడ్లీ..
దక్షిణాదిలో చాలా ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్ ఇది. చాలా రుచికరంగా ఉంటుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. సాంబారు లేదా కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా బియ్యం నూక, మినపపప్పుతో తయారౌతుంది. ఆరోగ్యపరంగా చాలా గుణాలుంటాయి. తేలికైన ఆరోగ్యమైన అల్పాహారాల్లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది.
Also Read: Pomegranate Benefits: దానిమ్మ ఒకే ఒక్క ఫ్రూట్‌తో కలిగి 4 అద్భుతమైన ప్రయోజనాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook