Reduce Belly Fat & Weight Loss with Pomegranate: ఆరోగ్యం, తగిన బరువు ఉండాలంటే తీసుకునే డైట్‌లో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే శరీరానికి కావల్సిన న్యూట్రియంట్లు, పోషకాలు అందుతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకుంటే.. గుండె ఆరోగ్యం నుంచి మెరుగైన జీర్ణక్రియ వరకూ అన్నింటినీ సుసాధ్యం చేసుకోవచ్చు.
- పండ్లు, కూరగాయల్లో న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైంది దానిమ్మ. దానిమ్మ ఏ అనారోగ్య సమస్య ఉన్నవాళ్లకైనా సూచించే అద్భుతమైన ఫ్రూట్. దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకూ అన్ని పొందవచ్చు. దానిమ్మ జ్యూస్ అనేది పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే అద్భుతమైన సహజసిద్ధమైన ఫ్రూట్ జ్యూస్.
- చాలామందికి సోడా, డ్రింక్స్, ఇత ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ వంటి సుగర్ డ్రింక్స్ అలవాటుంటుంది. ఇందులో సుగర్ ఒక్కటే కాకుండా పెద్దమొత్తంలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. రోజూ ఇవి తాగడం వల్ల శరీరంలో ఓ రకమైన కొవ్వు పేరుకుంటుంది. దీనికి ప్రత్యామ్నాయం దానిమ్మ జ్యూస్. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌తో దానిమ్మ జ్యూస్ తీసుకుంటే శరీరానికి కావల్సిన మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.
- దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మెటబోలిజం వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. దానిమ్మ జ్యూస్ రోజూ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు ఎనర్జీ కలుగుతుంది.
- దానిమ్మలో నాణ్యమైన ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. రుచి కూడా బాగుండటంతో తాగేందుకు వీలుంటుంది. ఆకలిని అదుపు చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. గుండె పనితీరు, కండరాల పటిష్టతకు దానిమ్మ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మ వర్కవుట్స్ సమయంలో తీసుకుంటే ఇంకా చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read: High Blood Pressure: జాక్‌ఫ్రూట్‌తో మలబద్ధకం, డయాబెటిస్‌తో పాటు బిపి సమస్యలకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook