Hemoglobin Deficiency: హిమోగ్లోబిన్ అనేది మనిషి రక్తంలో తగిన మోతాదులో తప్పకుండా ఉండాల్సిన పదార్ధం. లేకపోతే నీరసం, అలసట వెంటాడుతాయి. హిమోగ్లోబిన్ పెరగాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి
మనిషి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువైతే నీరసం వస్తుంది. రోజువారీ జీవితంలోని సాధారణమైన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేం. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ సెల్స్‌లో ఉండే ఐరన్ ఆధారిత ప్రోటీన్. ఇది శరీరంలోని అన్ని అంగాలకు ఆక్సిజన్ సరఫరా చేసే పని చేస్తుంది. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. అప్పుడే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పెరిగేందుకు ఏ విధమైన డ్రైఫ్రూట్స్ తీసుకోవాలో చూద్దాం..
అఖ్రోట్ లేదా వాల్నట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒలిచిన గుప్పెడు వాల్‌నట్స్‌లో దాదాపుగా 0.82 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువైనప్పుడు వాల్నట్ మంచి ప్రత్యామ్నాయం.
పిస్తా రుచి చాలామందిని ఆకర్షిస్తుంది. ఒక గుప్పెడు పిస్తా గింజల్లో 1.11 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా పిస్తా తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఎప్పుడూ ఉండదు.
జీడిపప్పు మరో అద్భుతమైన డ్రైఫ్రూట్. ఎక్కువగా స్వీట్స్, వంటల్లో ఉపయోగిస్తారు ఒక గుప్పెడు జీడిపప్పులో దాదాపుగా 1.89 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయి పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఇక మరో డ్రైఫ్రూట్ బాదం. ఇది అందరికీ తెలిసిందే. ఎక్కువగా వినియోగించే డ్రైఫ్రూట్. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. హిమోగ్లోబిన్ కొరతను తీర్చేందుకు బాదం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీక్నెస్ పూర్తిగా తొలగించి ఎనర్జీ ఇస్తుంది.
Also read: Eye Care Tips: కంటి వెలుగును పెంచే 5 అద్భుతమైన హోమ్ రెమిడీస్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook