High Blood Pressure: ఈ రసాలతో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు.. మీరు ఓ సారి ట్రై చేయండి.

High Blood Pressure Treatment: అధిక రక్తపోటు కారణంగా చాలామంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 12:55 PM IST
High Blood Pressure: ఈ రసాలతో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు.. మీరు ఓ సారి ట్రై చేయండి.

High Blood Pressure Treatment: గుండెపోటు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణం బీపీ సమస్యలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా అధిక రక్తపోటు కారణంగా చాలామంది మరణిస్తున్నారని ఇటీవల నివేదికలు వెల్లడించాయి. ఈ బీపీ సమస్యల నుంచి సకాలంలో ఉపశమనం పొందితే చాలా మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు బీపీ నిర్ధారణ పరీక్షలు కూడా చేసుకోవడం చాలా మంచిది. 

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా వారు తీసుకునే ఆహారంల్లో ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మానుకోవాలి. తీవ్ర అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స అందుకోవడం మేలు. అయితే ఇప్పుడు రక్తపోటు సమస్యలు అనేవి సాధారణ సమస్యగా, సాధారణ వ్యాధిగా మారడం వల్ల చాలామంది ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలతోనే ఇంట్లోనే ఉపశమనం పొందుతున్నారు. మీరు కూడా ఇంట్లోనే ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించండి. 

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:

ఈ దుంప రసం త్రాగండి:
బీట్రూట్ శరీరానికి చాలా మంచిది ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అయితే దీనితో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు అధిక రక్తపోటు ఉన్నవారు తాగితే సులభంగా బీపీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సగటున 250ml బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల సులభంగా అన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ కూరగాయలు, పండ్లు తినండి:
మార్కెట్లో లభించే పండ్లు కూరగాయలు కూడా శరీరానికి పోషక విలువలను అందిస్తాయి అంతేకాకుండా వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే ఎన్నో రకాల గుణాలు ఉంటాయి. రక్తపోటుతో బాధపడేవారు వారు వారు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు తీసుకుంటే సులభంగా అధిక రక్తపోటు సమస్యలనుంచి బయటపడోచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఆహారంలో బచ్చలి కూర, యాపిల్స్, నారింజ, అరటి పండ్లు తీసుకుంటే బీపీని సులభంగా నియంత్రించవచ్చు.

దానిమ్మ రసం:
దానిమ్మ రసంలో కూడా శరీరానికి కావాల్సిన పోషక విలువలు లభిస్తాయి అందుకే ఆరోగ్య నిపుణులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వీటిని తీసుకోమని సూచిస్తారు. అయితే దానిమ్మ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి ముఖ్యంగా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా దానిమ్మ రసాన్ని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.

Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!

Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News