Winter Problems: చలికాలంలో రోజూ ఈ 5 డ్రై ఫ్రూట్స్ తింటే హైబీపీ, గుండె వ్యాధులకు చెక్

Winter Problems: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.  ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 17, 2024, 07:07 PM IST
Winter Problems: చలికాలంలో రోజూ ఈ 5 డ్రై ఫ్రూట్స్ తింటే హైబీపీ, గుండె వ్యాధులకు చెక్

Winter Problems: చలికాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ తగ్గడం. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అంతేకాకుండా  రక్త నాళాలు కుచించుకుపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె వ్యాధులకు దారితీస్తుంది. 

అందుకే చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవల్సి ఉంటుంది. హెల్తీ ఫుడ్స్ డైట్‌లో భాగం చేసుకోవాలి. రోజువారీ డైట్‌లో కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ చేర్చితే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 5 రకాల డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. ప్రకృతిలో లభించే ఈ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ చలిలకాలంలో అద్భుతంగా పనిచేస్తాయి. మొదటిది అంజీర్. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్, పొటాషియం కారణంగా హై బీపీ రోగులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా మార్చుతుంది. 

రెండవది బాదం. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, హెల్తీ ఫ్యాట్స్ పెద్దఎత్తున ఉండటంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు 5-6 బాదం తినడం వల్ల రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మూడవది పిస్తా. పిస్తా క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త నాళాల స్వెల్లింగ్ తగ్గించవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, హెల్తీ ఫ్యాట్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

నాలుగవది వాల్‌నట్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. బ్లడ్ వెసెల్స్‌ను రిలాక్స్ చేస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చలికాలంలో రోజుకు 3-4 వాల్ నట్స్ తినడం వల్ల హై బీపీ సమస్య మెరుగుపడుతుంది. ఇక ఐదవది కిస్మిస్. ఇందులో పొటాషియం పెద్దఎత్తున ఉంటుంది. సోడియం లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. రక్త ప్రసరణ అదుపులో ఉంచుతుంది. రాత్రంతా నానబెట్టిన 10-12 కిస్మిస్‌లను ఉదయం పరగడుపున తినాలి. 

Also read: Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, భారీగా పెరగనున్న జీతం, డీఏ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News