High Cholesterol Symptoms: శరీరం అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు బాహ్య చర్మంపై పలు రకాల లక్షణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిప్పుడు దీని ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. ముఖ్యంగా ఈ సంకేతాలకు ప్రధాన కారణాలు శరీరంలో వ్యాధులు తీవ్రతరం కావడమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఈ లక్షణాలను ముందుగానే గమనించి తీవ్ర సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగినప్పుడు హెచ్చరికగా పలు సంకేతాలు మీరు గమణించవచ్చు. అయితే ఆ సాంకేతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన సంకేతాలు ఇవే:
పాదాలపై ఈ సమస్యలు తప్పవు:
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు తీవ్ర స్థాయిలో పెరిగినప్పుడు.. పాదాలలో తిమ్మిర్లు వస్తాయి. ముందుగా పాదాల్లో స్పర్శ కోల్పోతారు. అలాగే పాదాలలో జలదరింపు సమస్యలు కూడా వస్తాయి. అయితే రాత్రి పూటే ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
పాదాల నొప్పి:
కొలెస్ట్రాల్ కారణంగా కాళ్ల సిరల్లో మార్పులు వస్తాయి. దీని కారణంగా రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. ముఖ్యంగా ఆక్సిజన్ సరిగా అందదు. కావున పాదాల్లో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
గోర్ల రంగు మారడం:
కొలెస్ట్రాల్ ప్రభావం గోళ్లలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గోళ్లల్లో చాలా రకాల మార్పులు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగడం వల్ల సిరల్లో మార్పులు వస్తాయి. దీని కారణంగా గోళ్ల ప్రభావం పడి.. పసుపు రంగులోకి మారుతాయి. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి:
<<శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే.. పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలు..
<<ముందుగా ధూమపానం అలవాటును మానుకోండి.
<< కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తినండి.
<<సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.
<<రోజూ వ్యాయామం చేయండి.
Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
High Cholesterol: ఈ లక్షణాలుంటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లే.. కావున జాగ్రత్తగా ఉండండి..!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే..
పాదాలలో నొప్పులు వస్తాయి
గోర్ల రంగు మారడం