Honey For Teeth Pain: పిప్పి పన్ను తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. పళ్లకు సంబంధించిన ఏదైన పళ్లు ఇన్పెక్షన్ బారిన పడితే దానిని పిప్పి పళ్లు అంటారు. ఈ పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి వల్ల చాలా మంది పెయిన్ కిల్లర్ లను, యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాను పాటించడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, ఇన్పెక్షన్ తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిప్పి పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు పన్నుపై తేనెను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తేనెతో ప్రతిరోజు పళ్లు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
పిప్పి పన్నుపై వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల దాని వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఇంగువను కూడా ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల పిప్పి పన్నుపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయని వైద్యలు చెబుతున్నారు.
ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, ఇన్పెక్షన్ తగ్గుతుంది. కొన్నిసార్లు సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులు సంప్రదించడం చాలా మంచిది.
Also read: Amla Side Effects: ఉసిరితో దుష్పరిణామాలు కూడా ఉంటాయా, ఎవరెవరు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి