How To Control Blood Sugar: మధుమేహం కారణంగా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవశైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం బారిన పడిన వారు ఆనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల మధుమేహం పెరిగి గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధుమేహాన్ని నియంత్రించే చిట్కాలు ఇవే:
❂ ఉదయం పూట చాలా మంది టీ లేదా కాఫీలను అతిగా తాగుతున్నారు. వీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాఫీకి బదులుగా దాల్చిన చెక్క టీని తాగాలి.
❂ ప్రస్తుతం చాలా మంది అతిగా వేయించిన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటికి బదులుగా తృణధాన్యాలు తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
❂ అతిగా ఉప్పు కలిగిన ఆహారాలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో మంట పెరిగే అవకాశాలున్నాయి.
❂ బెర్రీల వెనిగర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు అతిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
❂ ప్రతి రోజు తప్పకుండా యోగాసనాలు చేయాలి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది.
❂ డ్రై ఫ్రూట్స్ నీటిని నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
❂ ఆరోగ్యకరమైన పండ్లను తినడం వల్ల కూడా మధుమేహంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
❂ మధుమేహంతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత తప్పకుండా 15 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
❂ డయాబెటిస్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook