Blackhead Remedies At Home: బ్లాక్ హెడ్స్ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. బ్లాక్ హెడ్స్ రావడం వల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే బ్లాక్ హెడ్స్ ఎలా వస్తాయి? ఈ సమస్య నుంచి బయట పడాలి అనేది మనం తెలుసుకుందాం. ఎండ చర్మానికి ఎక్కువగా తగలడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. చర్మనిపుణుల ప్రకారం చర్మంలోని మొలనోసైట్స్ ఎండ కారణంగా ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి. దీని కారణంగా బ్లాక్ హెడ్స్ వస్తాయని చెబుతున్నారు. కాబట్టిబ ఈ సమస్యతో బాధపడే వారు ఎండ తగలకుండా చూసుకోవాలి. లేదంటే సమస్య ఎక్కువ అవుతుంది. అయితే బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడేవారు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
→ బ్లాక్ హెడ్స్ సమస్య ఉన్నవారు ఎండలో తిరిగినప్పుడు కేప్ వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఎండ పడకుండా ఉంటుంది.
→ వేసవిలో ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి కొబ్బరి నూనెను రాసుకుని వెళ్లాలి. దీనివల్ల ఎండ నుంచి చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
→ బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో తేనె సహాయపడుతుంది. రోజూ తేనెతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట మర్దనా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
→ బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయటపడాలి అంటే ముల్తానీ మట్టి ఉపయోగపడుతుంది.
Also read: Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముందో లేదో ఎలా తెలుసుకోవడం
→ మడ్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఆ భాగాలకు ఆక్సిజన్, నీరు, పోషకాలు చక్కగా అందుతాయి. బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహయపడుతుంది.
→ నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలుగుతాయి. దీంతో ముక్కు వచ్చే నల్లటి మచ్చలు, బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్ వంటివి తగ్గుతాయి.
ఈ విధంగా చర్మంపై వచ్చే బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Chest Pain Signs: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ 5 ప్రమాదకర వ్యాధులు కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter