Healthy Kidneys: ఎక్కువగా నీరు తాగుతే కిడ్నీలపై ఎఫెక్ట్‌ పడుతుందా?

Drinking Water For Healthy Kidneys: శరీరానికి ఐదు లీటర్ల నీరు అవసరమని మనం చిన్నప్పటి నుంచి ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే శరీరానికి  ఐదు లీట‌ర్ల నీటిని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌పై అధికంగా ఒత్తిడి పడుతుంద‌ని మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని అని అపోహ పడుతుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 10:33 PM IST
Healthy Kidneys: ఎక్కువగా నీరు తాగుతే  కిడ్నీలపై ఎఫెక్ట్‌ పడుతుందా?

Drinking Water For Healthy Kidneys: ఆరోగ్య నిపుణుల ప్రకారం శరీరానికి ఐదు లీటర్ల నీరు చాలా అవసరం అని చెబుతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ అవకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. పొట్ట ప్రేగులు శుభ్రం చేయడంలో నీరు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

అయితే కొందరు  ఐదు  లీట‌ర్ల నీటిని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌పై అధికంగా ఒత్తిడి పడుతుంద‌ని అపోహ పడుతుంటారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మనం తెలుసుకుందాం.

ఐదు లీట‌ర్ల నీటిని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల  మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి ప‌డ‌ద‌ని  ఆరోగ్యినిపుణులు చెబుతున్నారు. మ‌నం తాగిన నీరు మూత్ర‌పిండాల‌ వరకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.  నీటిని తాగిన గంట‌న్న‌ర త‌రువాత మూత్ర‌విస‌ర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. మ‌నం తాగే నీరు మూత్ర‌పిండాలపై ఎటువంటి చెడు ప్ర‌భావాన్ని చూపించ‌ద‌ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

మనం తాగే నీరు ముందు పొట్ట ప్రేగుల తీసుకొని రక్తంలోకి పంపిస్తాయి. రక్తం నీటిని లివర్‌కి చేరుస్తుంది. లివర్‌ ఈ నీటిలో ఉండే చెడు క్రిములను తొలిగిస్తుంది. తరువాత రక్తం గుండెకు చేరుతుంది. దీని వల్ల శరీరంలోని  గుండె పంపింగ్‌ చేస్తుంది. మ‌నం తాగే నీరు శ‌రీరంలో క‌లిసి  త‌రువాత శరీరంల్లో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాల‌కు చేరుతాయి. మ‌నం నీటిని ఎక్కువ‌గా తాగితేనే మ‌న శ‌రీరం ఎక్కువ‌గా ఉన్న నీటిని మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తుంది.

Also read: Womens Health: మహిళ్లలో వచ్చే పోషకాహార లోపంకు చెక్‌ పెట్టిండి ఇలా!

మూత్ర‌విస‌ర్జ‌న చేస్తేనే మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. రెండున్న‌ర లీట‌ర్ల మూత్రాన్ని విస‌ర్జించాలి. మూత్రం ఎప్పుడూ కూడా తెల్ల‌గా ఉండాలి. మూత్రం తెల్ల‌గా ఉంటేనే మ‌న శ‌రీరంలో త‌గినంత నీరు ఉంటుంది.  మూత్రం ప‌సుపు రంగులో క‌నిపిస్తే మ‌నం నీటిని తాగ‌డం లేద‌ని తెలుస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Liver Health: ఈరోజు నుంచే ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి.. మీ లివర్ కు నో రిస్క్ ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News