కిడ్నీలు శరీరంలోని వివిధ అంగాల్లో కీలకమైనవి. శరీరంలో అత్యంత ముఖ్యమైన పని చేస్తుంటాయి. కిడ్నీల సమస్య ఏర్పడితే కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాల ద్వారా కిడ్నీ సమస్య ఉందో లేదో పసిగట్టేందుకు వీలుంటుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లకు సంబంధించిన ఈ లక్షణాలు మీలో కిడ్నీ సమస్యను పసిగడతాయి.
మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన కిడ్నీల పనితీరు ఎప్పుడూ బాగుండేట్టు చూసుకోవాలి. కిడ్నీల పనితీరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీల పనితీరు చెడిందంటే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే అర్ధం. కిడ్నీల పనితీరు లేదా కిడ్నీల ఆరోగ్యం పూర్తిగా మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఏర్పడిందంటే..కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీలు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. కిడ్నీలు పాడైతే ఎలాంటి లక్షణాలు బయటకు కన్పిస్తాయో తెలుసుకుందాం..
కిడ్నీలు పాడైతే కన్పించే లక్షణాలు
1. కిడ్నీలు పాడైతే లేదా పని తీరు మందగిస్తే తరచూ రాళ్ల సమస్య ఏర్పడుతుంది. వాస్తవానికి యూరిన్‌లో మినరల్స్, సాల్ట్ డిపోజిట్ కారణంగా కిడ్నీలో రాళ్లు తరచూ ఏర్పడుతుంటాయి. మీ కిడ్నీలు త్వరగా డ్యామేజ్ కానున్నాయనేదానికి ఇది సంకేతం. ప్రధాన లక్షణం
2. ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నడుము నొప్పి, మూత్రంలో నురుగు, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం సమయంలో నొప్పి, జ్వరం, అలసట, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి.
3. ఎవరికైనా కిడ్నీలు పాడయితే..కిడ్నీలు విఫలమవడం ఓ ప్రధాన లక్షణం. కిడ్నీ విఫలం అనేది ఇతర కిడ్నీ సమస్యల కారణంగా కావచ్చు. శరీరం నుంచి వ్యర్ధ పదార్ధాలు బయటకు తొలగే సామర్ధ్యం తగ్గినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.
4. కిడ్నీలు విఫలమైతే వేళ్లు, కాళ్లలో వాపు ఉంటుంది. ఛాతీలో మంట, తల తిరగడం, చర్మంపై ఎర్రటి ర్యాషెస్, దురద, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పిస్తాయి.
5. మీ కాళ్లు, చేతుల్లో వాపు ఉన్నట్టు కన్పిస్తే అది కిడ్నీల డ్యామేజ్ లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. చేతులు, కాళ్లలో వాపు అనేది కిడ్నీ డ్యామేజ్ ప్రాధమిక లక్షణాల్లో ఒకటి.
Also read: Weight loss tips: ఈ పదార్ధాలు తీసుకుంటే ఆకలికి చెక్, 40 రోజుల్లో స్థూలకాయం మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook al