Vegetable Juices: కూరగాయల జ్యూస్‌లు.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Vegetable Juices: ప్రకృతిలో లభించే కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల గుణాలుంటాయి. కూరల్లానే కాకుండా..జ్యూస్ రూపంలో తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలేంటనేది చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2022, 12:08 PM IST
Vegetable Juices: కూరగాయల జ్యూస్‌లు.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Vegetable Juices: ప్రకృతిలో లభించే కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల గుణాలుంటాయి. కూరల్లానే కాకుండా..జ్యూస్ రూపంలో తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలేంటనేది చూద్దాం.

ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం మొక్కల్లో ఒక్కోరకం గుణాలున్నాయి. ప్రతి కూరగాయకూ ఓ విశిష్టమైన గుణముంది. కూరగాయలతో అధిక బరువు, ఊబకాయం, బానపొట్ట వంటి చాలా రకాల సమస్యల్ని తొలగించుకోవచ్చు. ప్రతిరోజూ క్యాబేజ్ జ్యూస్ తాగితే..ఎప్పట్నించో నయం కాని జబ్బులు నయమౌతాయి. కడుపులో అల్సర్లు వంటివి నయమౌతాయి. మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఊబకాయం తగ్గుతుంది. 

ఇక బీట్‌రూట్ రసంతో (Beetroot Juice) కంటి చూపు మెరుగు పడుతుంది. అజీర్తి, పెప్టిక్ అల్సర్, కడుపు నొప్పి సమస్యలకు మంచి పరిష్కారం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే బీట్‌రూట్‌కు మించింది మరొకటి లేదు. క్యారెట్ జ్యూస్ చాలా రకాల సమస్యలకు అద్భుతమైన ఔషధం. ఇందులో అధికంగా ఉండే విటమిన్ ఏ కంటికి చాలా మంచిది. కేన్సర్ కణాల్ని నిరోధించే గుణం క్యారెట్‌లో ఉంది. కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నవారు క్యారట్ జ్యూస్ తాగితే చాలా మంచిది.

కీరా లేదా దోసకాయ జ్యూస్‌తో అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. దోసకాయ ఒంటికి చలవ కల్గిస్తుంది. ఉల్లిపాయ జ్యూస్ చాలా మందికి తెలియదు. ఉల్లిపాయలో అద్బుతమైన యాంటీ బయోటిక్ గుణాలున్నాయి. గాయమైనప్పుడు ఉల్లిరసం రాస్తే..త్వరగా నయమౌతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (Bad Cholesterol) కూడా తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే..కిడ్నీలో రాళ్ల సమస్య, స్త్రీలలో రుతు సమస్య, అధిక రక్తస్రావం, మలబద్దకం, ఎసిడిటీ వంటివి దూరమౌతాయి. ఇక ప్రతి రోజూ టమోటా రసం తీసుకోవడం ద్వారా ఒంట్లో వేడి తగ్గుతుంది. ముఖంలో కళ పెరుగుతుంది. అదే సమయంలో ముఖంపై మొటిమలు కూడా పోతాయి.

Also read: immunity supplements: ఇమ్యునిటీ కోసం ఇవి ఎక్కువగా తీసుకుంటే.. మరో పెద్ద రిస్క్ తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News