Dates: ప్రతిరోజు ఖర్జూరం పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Benefits Of Eating Dates: డ్రై ఫూట్స్‌ లో  ఒకటి  ఖర్జూర పండు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఖర్జూరం పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 10:43 PM IST
Dates: ప్రతిరోజు ఖర్జూరం పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Benefits Of Eating Dates: ఖ‌ర్జూర పండ్లు ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని తీపి ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఖర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి   ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖ‌ర్జూర పండ్ల‌ల్లో ఉండే పోష‌కాలు అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఖ‌ర్జూర పండ్ల‌ల్లో పొటాషియం, ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్, ఫైబ‌ర్, విట‌మిన్ బి6, కె వంటి ఎన్నో పోష‌కాలు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుప‌డుతుంది.

ఖ‌ర్జూర పండ్ల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. 

శ‌రీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను న‌శింప‌జేసి ఖ‌ర్జూర పండు ఎంతో మేలు చేస్తుంది.

ఎముకలు ధృడంగా ఉండాలి అంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరం పండ్లను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Blackhead: బ్లాక్‌ హెడ్స్‌ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఖ‌ర్జూర పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఖ‌ర్జూర పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రక్త‌పోటు అదుపులో ఉంటుంది. 

నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లతో బాధపడుతున్నవారు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.

ఈ విధంగా ఖ‌ర్జూర పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Also read: Cucumber: దోసకాయ మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News