Lifestyle Diseases: లైఫ్‌స్టైల్ వ్యాధులకు ఎలా చెక్ పెట్టాలి

Lifestyle Diseases: ఆధునిక జీవితంలో ఎదురౌతున్న వ్యాధులు లైఫ్‌స్టైల్ వ్యాధులు. ఇంచుమించు అందరూ ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. అసలీ లైఫ్‌స్టైల్ వ్యాధులేంటి, ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2022, 12:35 AM IST
Lifestyle Diseases: లైఫ్‌స్టైల్ వ్యాధులకు ఎలా చెక్ పెట్టాలి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. నిరంతరం ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఫలితంగా పలు వ్యాధులకు గురవుతూ..ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇవే లైఫ్‌స్టైల్ వ్యాధులు.

ఆధునిక జీవితంలో రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం అనేవి లైఫ్‌స్టైల్ వ్యాధులుగా పరిణమించాయి. ఎవరో ఒకరిద్దరు కాదు దాదాపు అందరూ ఈ సమస్యలకు గురి అవుతున్నారు. ఈ రెండూ చాపకింద నీరులా విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా లైఫ్‌స్టైల్ వ్యాధుల్ని నిర్మూలించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

లైఫ్‌స్టైల్ వ్యాధులకు కారణాలు

నిత్యం ఎదురౌతున్న సవాళ్లు, కాలంతో పోటీ పడుతూ క్షణం తీరిక లేకుండా గడిపే పరిస్థితి, నిద్ర లేమి, మానసిక ప్రశాంతత లోపించడం, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాలున్నాయి. ఇవన్నీ మనిషి జీవితాన్ని సవాలు చేస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా రక్తపోటు, మధుమేహం వ్యాధులు పెరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

డయాబెటిస్ వ్యాధిని పరిశీలిస్తే..30 ఏళ్లు నిండిన ప్రతి పదిమందిలో ఒకరికి మధుమేహం ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య గ్రామాల్లో 26 శాతం ఉంటే..పట్టణాల్లో 30 శాతం మందికి ఉంది. మధుమేహం గ్రామాల్లో 19 శాతం ఉంటే..పట్టణాల్లో 24 శాతముంది. వివరాలు పరిశీలిస్తే..కేవలం అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగానే ఈ లైఫ్‌స్టైల్ వ్యాధులకు గురౌతున్నారని పరిశోధకుల అంచనా.

సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిస కావడం కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సాధ్యమైనంతవరకూ మీ మైండ్‌ను వీటి నుంచి మళ్లించాలి. దీనికోసం యోగా, వ్యాయామం, వాకింగ్ వంటివి మంచి ప్రత్యామ్నాయాలు. 

Also read: Cancer Care Diet: ఆ పదార్ధం రోజూ తీసుకుంటే కేన్సర్ కారకాలు సైతం నాశనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News