Control Diabetes: మండూకాసనంతో మధుహానికి శాశ్వతంగా బైబై..

Mandukasana For Control Diabetes Type 2: మండూకాసనాన్ని ప్రతి రోజు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ప్రతి రోజు చేస్తే రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 04:01 PM IST
Control Diabetes: మండూకాసనంతో మధుహానికి శాశ్వతంగా బైబై..

 

Mandukasana For Control Diabetes: శరీరం తగిన పరిమాణంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల అనేక రాకల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో చాలా మందిలో సాధరణంగా వచ్చే వ్యాధి మధుమేహం. ఈ వ్యాధి కారణంగా చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాల్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. అయితే ఈ చక్కెర పరిమాణాలు తగ్గడం, పెరగడమనేది జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా మంది వైద్యులు మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మూత్రపిండాలు, చర్మం, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. దీని కారణంగా ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి ప్రతి రోజు ఈ కింది ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది.  

మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు మండూకాసనం వేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల పొత్తికడుపు కండరాలు దృఢంగా మారడమే కాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మండూకాసనాన్ని బరువు తగ్గాలనుకునేవారు కూడా వేయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని ఎలా వేయాలో? దీనిని వేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

మండూకాసనాన్ని ఇలా వేయండి:
మండూకాసనం చేయడానికి..ముందుగా వజ్రాసనంలో కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు చేతులనుయ పిడికిలిగా ముడుచుకోవాలి. కానీ బొటనవేళ్లను మాత్రం బయటికి ఉంచాల్సి ఉంటుంది. పిడికిలి తొడల దగ్గరికి తీసుకుని నాభిపైకి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముందుకు వంగి..మీ ఛాతీతో మీ తొడలను తాకాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు గాలి పీల్చిని నెమ్మదిగా పిల్చుకుంటూ..బయటకు వదలాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 3 నుంచి 5 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల రాకుండా ఉంటాయి. 

మండూకాసనం వల్ల కలిగే ప్రయోజనాలు:
మండూకాసనం ప్రతి రోజు చేయడం వల్ల పొట్ట భాగం దృఢంగా మారుతుంది.
అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సులభంగా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది. 
ఈ ఆసనం ప్రతి రోజు వేయడం వల్ల అవయవాలకు మసాజ్‌ అవుతుంది. 
డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 
శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News