Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధి ప్రధాన లక్షణాలు, ఎలా గుర్తించాలి

Kidney Disease Symptoms: అధునిక జీవనశైలి కారణంగా ప్రధానంగా ఎదురవుతున్న సమస్య కిడ్నీ సమస్య. కిడ్నీ వ్యాధి అనేది ఓ సైలెంట్ కిల్లర్. లక్షణాల్ని ముందుగా గుర్తించలేకపోతే..ప్రాణాంతకమవుతుంది. అందుకే ఆ లక్షణాలేంటనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2022, 11:41 AM IST
 Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధి ప్రధాన లక్షణాలు, ఎలా గుర్తించాలి

Kidney Disease Symptoms: అధునిక జీవనశైలి కారణంగా ప్రధానంగా ఎదురవుతున్న సమస్య కిడ్నీ సమస్య. కిడ్నీ వ్యాధి అనేది ఓ సైలెంట్ కిల్లర్. లక్షణాల్ని ముందుగా గుర్తించలేకపోతే..ప్రాణాంతకమవుతుంది. అందుకే ఆ లక్షణాలేంటనేది తెలుసుకుందాం.

మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీ. శరీరంలోని విష పదార్ధాల్ని బయటకు పంపించడంలో కిడ్నీ పాత్ర కీలకం. యూరియా, క్రియేటిన్, యాసిడ్ వంటి నైట్రోజన్ మిళిత వ్యర్ధ పదార్ధాల్నించి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. గాయాలైనప్పుడు లేదా బ్లడ్ ప్రెషర్ ఎక్కువున్నప్పుడు, డయాబెటిస్ లేదా కిడ్నీ డ్యామేజ్ ఉన్నప్పుడు విష పదార్ధాలు ఫిల్టర్ కావడంలో సమస్య ఎదురవుతుంది. దీంతో విషపదార్ధాలు పేరుకుపోతాయి. కిడ్నీలు పాడయినప్పుడు ఉండే లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. ఆ లక్షణాల్ని ( Kidney Disease Symptoms) త్వరగా గుర్తించగలిగితే సమస్య ఉండదు. ఆ లక్షణాలేంటో చూద్దాం.

ప్రతి సందర్భంలో తీవ్రమైన అలసట, లేదా నీరసం ఉండటం కిడ్నీవ్యాధికి ప్రారంభ సంకేతమవుతుంది. కిడ్నీ వ్యాధి తీవ్రమయ్యేకొద్దీ..ఆ వ్యక్తి ముందుకంటే బలహీనమైపోతాడు. కొద్దిదూరం నడిచినా సరే..సమస్యగా మారుతుంది. కిడ్నీలో విషపదార్ధాలు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. 

ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 6-10 సార్లు మూత్ర విసర్ణన చేస్తాడు. అంతకంటే ఎక్కువ సార్లు వెళ్తుంటే కిడ్నీ పాడవుతున్నట్టు సంకేతం. కిడ్నీ సమస్య (Kidney Problems) ఉన్నవారికి మూత్రం చాలా తక్కువ సార్లు లేదా ఎక్కువసార్లు అవుతుంది. రెండింటింలో ఏది ఉన్నా సరే కిడ్నీ సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి.

మనిషి శరీరంలో విషపదార్ధాలు ఎక్కువగా ఉంటే ఆకలి తగ్గిపోతుంది. దీంతో బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కడుపు నిండుగానే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. ఏదీ తినాలన్పించదు. ఇది కిడ్నీ పాడయిందనేందుకు ప్రధాన సంకేతం. కిడ్నీ అనేది శరీరంలోని అధిక సోడియంను ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే..సోడియం అనేది శరీరంలో పేరుకుపోతుంది. దీంతో కాళ్లు, పాదాల్లో వాపు కన్పిస్తుంది. చర్మం డ్రైగా ఉండటం, దురద కూడా కిడ్నీవ్యాధికి లక్షణం. కిడ్నీ శరీరంలోని విషపదార్ధాల్ని బయటకు పంపించనప్పుడు బ్లడ్‌లో పేరుకుపోతాయి. దాంతో దురద లేదా డ్రైనెస్ సమస్యలు వస్తాయి.

Also read: Best Tips for Sleep: నిద్రలేమి సమస్యగా మారిందా..ఈ చిట్కాలు పాటిస్తే మంచి నిద్ర పడుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News