Diabetes: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే కచ్చితంగా మధుమేహం ఉన్నట్టే !

Diabetes Warning Signs: ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే చాలామంది చిన్న వయసు వార.. డయాబెటిస్ తమకి ఉంది అని కూడా గుర్తించలేకపోతున్నారు. వ్యాధి ముదిరిపోయే.. వరకు చాలామందిలో డయాబెటిస్ బయటపడటం లేదు. కానీ మధుమేహం సోకితే.. మన శరీరం మనకి కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం పట్టించుకుని టెస్ట్ చేయించుకోవాలి. ఇంతకీ డయాబెటిస్ సంకేతాలు.. ఏంటో తెలుసుకుందాం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 11, 2024, 04:32 PM IST
Diabetes: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే కచ్చితంగా మధుమేహం ఉన్నట్టే !

Diabetes Symptoms: మన శరీరంలో ఇన్స్యులిన్ హార్మోన్ లెవెల్ తగ్గడం వల్ల రక్తంలో అధిక గ్లూకోజ్ ఏర్పడడం జరుగుతుంది. దానినే డయాబెటిస్ (చక్కర వ్యాధి) అని పిలుస్తాం. 

వయసుతో సంబంధం లేకుండా.. అప్పుడే పుట్టిన పిల్లలనుంచి.. 70 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు.. ఎవరికైనా ఈ వ్యాధి సొకగలదు. ఇది కేవలం జన్యుపరంగా.. తల్లిదండ్రులకు ఉంటేనే.. పిల్లలకి వస్తుంది అనే రకమైన వ్యాధి కాదు. మన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. కూడా షుగర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అయితే మధుమేహం.. ప్రాణాంతకమైన వ్యాధి కాదు. సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉంటే, షుగర్ తో కూడా జీవిత కాలం.. హాయిగా ఉండొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి.. ముందు షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక చిన్న బ్లడ్ టెస్ట్ తో మధుమేహం ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ బ్లడ్ టెస్ట్ చేయించడానికి కంటే ముందే.. మన శరీరం మనకి కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను మనం గుర్తించి.. వెంటనే జాగ్రత్త పడితే.. వ్యాధి ముదరకముందే మనం జాగ్రత్త పడొచ్చు. 

మధుమేహం ఎందుకు వస్తుంది? 

మన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినేవారు, శారీరక శ్రమ పెట్టనివారు, సరైన సమయానికి భోజనం చేయకుండా.. నిద్రపోకుండా ఉండేవాళ్ళు.. మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి కూడా మధుమేహం సోకుతుంది.

మధుమేహాని గుర్తించడం ఎలా? 

మధుమేహం సోకిన వారు.. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వారికి దాహం ఎక్కువగా వేస్తుంది. గొంతు తడి బారిపోతున్నట్లు అనిపిస్తుంది. కారణం లేకుండా కొంతమంది.. బరువు తగ్గిపోతూ ఉంటారు. కొందరిలో చూపు కూడా మందగిస్తుంది. మరికొందరిలో పంటి చిగుళ్లలో.. ఇన్ఫెక్షన్లు వస్తాయి. శరీరంపై చిన్న గాయాలు కూడా మానడానికి.. చాలా కాలం పడుతూ ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. కాళ్లలో స్పర్శ తగ్గి తిమ్మిర్లు ఎక్కువ అవుతాయి. 

ఇలాంటి లక్షణాల్లో ఏవి కనిపించినా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బ్లడ్ టెస్ట్.. చేసుకోవడం మంచిది. పరకడుపున చేయించుకున్న బ్లడ్ టెస్ట్ లో మన రక్తంలోని షుగర్ లెవెల్ 100 మిల్లీగ్రాముల లోపు ఉంటే మధుమేహం లేనట్లే. 

కానీ 120 మిల్లీగ్రాములు కంటే ఎక్కువగా ఉన్నా, భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 200 మిల్లీగ్రాములు కంటే ఎక్కువ గా ఉన్న వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News