Ghee Side Effects: సహజసిద్ధంగా లభించే ఆహారపదార్ధాల్లో నెయ్యి చాలా బలవర్ధకమైంది. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే అతిగా వాడితే నెయ్యితో కూడా అనర్ధాలే. అవేంటో తెలుసుకుందాం.
బలమైన రోగ నిరోధక శక్తి (Immunity) కలిగిన ఆహార పదార్ధం నెయ్యి. ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. అద్భుతమైన పోషక పదార్ఱాలున్నాయి. నెయ్యి మనిషికి బలం చేకూరుస్తుంది. అందుకే చిన్నారులకు భోజనంలో నెయ్యి కలిపి తినిపిస్తుంటారు. నెయ్యి కేవలం బలమైన ఆహార పదార్ధమే కాకుండా..వంటలకు అదనపు రుచిని ఇస్తుంది. అయితే నెయ్యి అతిగా వాడితే అనర్ధాలు కూడా ఉన్నాయనే సంగతి మర్చిపోకూడదు. ఒకవేళ మీరు నెయ్యి అధికంగా వాడుతున్నట్లయితే..మానేయడం మంచిది. నెయ్యిని ఎక్కువగా వాడితే సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు. ఆ సమస్యలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అధికంగా నెయ్యి వాడితే తలనొప్పికి దారి తీస్తుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. వాంతులు వంటి సమస్యలు కూడా అవకాశముంది. కొలెస్ట్రాల్ (Cholesterol) అధిక మోతాదులో ఉండే నెయ్యిని తీసుకోవడం వల్ల శాచ్యురేటెడ్ ఫ్యాటీ లెవెల్స్ పెరిగిపోతాయి. దాంతో కొవ్వు పెరిగి..గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. నెయ్యి ఎక్కువగా (Ghee Side Effects) తీసుకుంటే..అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే డయేరియా వస్తుంది. రోజు అదే పనిగా నెయ్యి తీసుకుంటే..ఒంట్లో వేడి పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకూ నెయ్యి పరిమితంగా తీసుకోవడం మంచిది.
Also read: Omicron Latest Study: ఒమిక్రాన్ తాజా అధ్యయనంలో ఆందోళన కల్గించే అంశాలు, ప్రమాదకరమే మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook