Pistachio For Weight Loss, Bad Cholesterol: స్వీట్లలో అధికంగా వినియోగించే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పలుకులు ఒకటి. మార్కెట్లో లభించే బాదం ఎండు ద్రాక్ష ఇతర నడుచు కంటే పిస్తా పలుకుల్లో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎక్కువగా పిస్తా పలుకులు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. పిస్తా పలుకులు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి సందేహం కలగవచ్చు..?. పిస్తా పలుకులను వాటిపై పొత్తును తీసి నెయ్యిలో వేయించి క్రమం తప్పకుండా తీసుకుంటే తీవ్రవ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని రక్షించడమే కాకుండా దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే చాలామంది మార్కెట్లో లభించే అనారోగ్యకరమైన ఆహారాలను సాయంత్రం పూట స్నాక్స్ గా తింటున్నారు. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట స్నాక్స్ తినే బదులు పిస్తాను చిరుతిళ్ళగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పిస్తా పలుకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. చాలామంది శరీర బరువును తగ్గించుకునే క్రమంలో వివిధ రకాల డైట్లను అనుసరిస్తారు. అయితే ఈ క్రమంలో డైట్లో పిస్తా పలుకులను కూడా వినియోగిస్తే.. ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఉండే పోషక విలువలు స్థాయిలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు ఉండడమే.. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పిస్తా పలుకులను అధిక పరిమాణంలో ఆహారాల్లో క్రమం తప్పకుండా వినియోగించాలి. ఇలా వీటిని వినియోగిస్తే అధిక రక్తపోటు సమస్య తగ్గి హార్ట్ ఎటాక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?
Also Read: Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook