Pumpkin Juice Benefits: గుమ్మడి కాయలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను చేకూర్చుతాయి. దీంతో పాటు ఇప్పటికే బరువు తగ్గడం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు గుమ్మడి కాయతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు గుమ్మడిలో ఉండే విటమిన్ సి శరీరంతో పాటు చర్మాకి చాలా మేలు చేస్తుంది. దీంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి కాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ:
గుమ్మడి కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
గుమ్మడి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దీని నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి..:
గుమ్మడి కాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా చేస్తుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
రక్తపోటును నియంత్రిస్తుంది:
పొటాషియంగా అధికంగా ఉండే వాటిల్లో ఈ గుమ్మడి కూడా ఒకటి. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల కూడా సులభంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
చర్మానికి మేలు చేస్తుంది:
గుమ్మడి కాయలో విటమిన్ ఎతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేయడమే కాకుండా ముడతలను తగ్గించేందుకు, మచ్చలు రాకుండా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి