Rajgira Laddu For Weight Loss In 9 Days: ఆధునిక జీవన శైలి కారణంగా బరువు తగ్గడం ఒక పెద్ద సవాలు మారింది. ఆహారపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు మార్పులు రావడంతో చాలా మంది అనారోగ్య సమస్యలో పాటు, బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా చాలా మంది అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, గుండెపోటు వ్యాధులకు లోనవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌తో పాటు, బరువును కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆరోగ్య నిపుణులు సూచించిన పలు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఆయితే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ సూచించిన రాజ్‌గిరతో తయారు ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేకాకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి తప్పకుండా ఈ లడ్డును తీసుకోవాల్సి ఉంటుంది:
ప్రస్తుతం మార్కెట్లో రాజ్‌గిరతో తయారు చేసిన ఆహార పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ముఖ్యంగా వాటితో తయారు చేసిన లడ్డులను ప్రజలు ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే బరువు తగ్గేవారు కూడా వీటితో తయారు చేసిన లడ్డులను ప్రతి రోజూ తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్‌ను కూడా సులభంగా కరిగిస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఈ లడ్డులను తినడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు.
ఈ రాజ్‌గిర లడ్డూలో అధిక పరిమాణంలో ప్రోటిన్స్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా తరచుగా నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఔషధంగా పని చేస్తుంది. అయితే ఈ లడ్డులను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజ్‌గిర లడ్డూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రాజ్‌గిర లడ్డూల్లో అధిక పరిమాణంలో ప్రొటీన్లు లభిస్తాయి. ఇది మన కండరాలు, శరీర అభివృద్ధికి చాలా సహాయపడతాయి.
ఇందులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సమస్యలను కూడా తగ్గించి.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు చెక్ పెడతాయి.
వీటితో తయారు చేసి లడ్డులను ప్రతి రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook