Reduce Belly Fat: చలి కాలంలో బెల్లీ ఫ్యాట్‌, బరువును ఇలా వారంలో తగ్గించుకోండి..

Reduce Belly Fat 7 Days: చాలామంది ఆధునిక జీవనశైలి కారణంగా బరువు పెరుగుతున్నారు. అయితే వీర బరువును తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తగ్గలేకపోతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 02:16 PM IST
Reduce Belly Fat: చలి కాలంలో బెల్లీ ఫ్యాట్‌, బరువును ఇలా వారంలో తగ్గించుకోండి..

Reduce Belly Fat 7 Days: మారుతున్న కాలం కారణంగా బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారింది. చాలామంది బరువు తగ్గడానికి కఠినతర వ్యాయామాలు చేయడమే కాకుండా ఆహారాలను తినడం కూడా మానుకుంటున్నారు. ఇలా చేసిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గడం పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నా వాటిని పాటించడం లేదు. అయితే బరువు తగ్గడానికి అనుసరించే డైట్లలో కొన్ని ఆహారాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి పోషకాలు కలిగిన గోధుమ ధాన్యాలతో కూడిన ఆహారాలు తీసుకుంటే సులభంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి డైట్లో ఎలాంటి ఆహారాలు చేర్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఈ ధాన్యాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
మొక్కజొన్న:

మొక్కజొన్న ను సాధారణ భాషలో మొక్క బుట్టలు అంటారు. వీటిని చాలామంది చిరుదిండ్లుగా తీసుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి అనుసరించే డైట్లలో ఈ మొక్కజొన్నను తీసుకుంటే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

బ్రౌన్ రైస్:
మధుమేహంతో బాధపడుతున్న వారికి బ్రౌన్ రైస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి కూడా డైట్ లో బ్రౌన్ రైస్ ను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ కొలెస్ట్రాలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా బ్రౌన్ రైస్ ను వినియోగించండి.

చిరుధాన్యాలు:
చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి గురించి ప్రస్తుతం విస్తృత ప్రచారం జరగడంతో మార్కెట్లో ఇవి విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అయితే ఈ చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ బి బరువును ఆరోగ్యంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News