How To Control Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ రెండు రకాలుగా ఉంటుంది. LDL అనేది శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్.. దీని కారణంగా స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా సిరల్లో ఈ ఎల్‌డిఎల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ కూడా ఉంది. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా రక్తంలో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగి చక్కెర పరిమాణాలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
ఈ ఆహారాలతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చా?:
యాపిల్స్ చెడు కొలెస్ట్రాల్‌కు మాయం:
యాపిల్స్‌లో పెక్టిన్ వంటి కరిగే ఫైబర్‌లు అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి యాపిల్స్‌ను ప్రతి రోజు తినడం వల్ల ఎల్‌డిఎల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ పరిమాణలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
బాదం పప్పు:
బాదం పప్పులో ఉండే డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా 7 నుంచి 10 బాదం పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది.
బార్లీ, వోట్స్:
బార్లీ, వోట్స్‌లో బీటా-గ్లూకాన్స్ వంటి కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బార్లీ, వోట్స్‌తో తయారు చేసిన రోటీలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook