Ridge Gourd Remedies: వారంలో 2-3 సార్లు బీరకాయ తింటే ఎలాంటి వ్యాధి దరిచేరదంటే నమ్ముతారా

Ridge Gourd Remedies: శరీరం ఆరోగ్యంగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు తప్పకుండా ఉండాలి. వాస్తవానికి శరీరానికి కావల్సిన పోషకాలన్నీ మన చట్టూ లభించే వివిధ రకాల కూరగాయలు, పండ్లలోనే పుష్కలంగా లభిస్తుంటాయి. ఏవి ఎందులో ఉన్నాయో తెలుసుకుని వాడితే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2024, 03:55 PM IST
Ridge Gourd Remedies: వారంలో 2-3 సార్లు బీరకాయ తింటే ఎలాంటి వ్యాధి దరిచేరదంటే నమ్ముతారా

Ridge Gourd Remedies: మనం నిత్యం ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం హెల్తీ ఫుడ్స్ తినకపోవడమే. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కల్గించే ఆహార పదార్ధాలంటే కూరగాయలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కూరగాయల్లో బెస్ట్ అంటే బీరకాయ. చాలామంది ఇష్టంగా తినకపోవచ్చు గానీ ఆరోగ్యపరంగా ఇది చాలా బెస్ట్ అని వైద్యులు చెబుతుంటారు

ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయల్లో ఎలాంటి దుష్పరిణామాలు కల్గించనిది, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండేది బీరకాయ. ఇందులో అధికంగా ఉండే వాటర్, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. ఫైబర్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, సోడియం విటమిన్ బి6, ఐరన్, జింక్, కాపర్, థయామిన్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. బీరకాయను వారంలో కనీసం 2 సార్లు తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని విష పదార్ధాలను తొలగించి డీటాక్స్ చేస్తాయి. లివర్‌ను హెల్తీగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ కారణంగా ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

బీరకాయలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. తరచూ అల్సర్ల సమస్య ఉండేవారికి బీరకాయ చాలా మంచిది. మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. ఐరన్ లేదా హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు వారంలో కనీసం 3 సార్లు బీరకాయ తింటే చాలా మంచిది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. బీరకాయలో ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువ. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెగ్నీషియం కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

బీరకాయలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని అన్ని విధాలుగా నష్టపరిచే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బీరకాయ క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. 

Also read: Cholesterol Remedies: కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా, ఈ 7 ముూలికలు రోజుకొకటి ఒక్కసారి వాడితే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News