Sarcoma Cancer: సర్కోమా కేన్సర్ అంటే ఏమిటి, ఎందుకిది అత్యంత ప్రమాదకరం, లక్షణాలేంటి

Sarcoma Cancer: ఆధునిక యుగంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని రోగాలు మనిషిని పీడిస్తూనే ఉన్నాయి. ప్రాణాంతకంగా మారి ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైంది ప్రమాదకరమైంది కేన్సర్. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 29, 2024, 10:38 PM IST
Sarcoma Cancer: సర్కోమా కేన్సర్ అంటే ఏమిటి, ఎందుకిది అత్యంత ప్రమాదకరం, లక్షణాలేంటి

Sarcoma Cancer: ఆధునిక జీవన విధానంలోనే కాదు..అనాది నుంచి మనిషిని భయపెడుతుంది, ప్రాణాలు తీస్తున్నది కేన్సరే. ఇందులో సర్కోమా కేన్సర్ మరింత ప్రమాదకరమైంది. ఇటీవలే ప్రఖ్యాత సింగర్ క్యాట్ జెనిస్ 31 ఏళ్లకే  Sarcoma Cancer కారణంగా ప్రాణాలు కోల్పోయింది. అసలీ Sarcoma Cancer అంటే ఏమిటి, ఎందుకింత ప్రమాదకరమో తెలుసుకుందాం..

వాస్తవానికి క్యాట్ జెనిస్‌కు మెడలో ఓ కణితి గుర్తించిన తరువాత అది కాస్తా Sarcoma Cancer అని తేలింది. ఇది ఎముకల్లో, సాఫ్ట్ టిష్యూస్‌లో ఏర్పడే కేన్సర్‌లోని ప్రమాదకరమైన రకం. సర్జరీ, కిమియోథెరపీ, రేడియేషన్ అన్నీ చేయించినా లాభం లేకపోయింది. 

Sarcoma Cancer అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఇది శరీరంలోని సాఫ్ట్ టిష్యూస్, కండరాలు, ఫ్యాటీ టిష్యూస్, ఎముకల్లో ఏర్పడుతుంది. శరీరంలోని వివిధ ప్రక్రియల్లో సాఫ్ట్ టిష్యూస్ పాత్ర కీలకం. ఈ టిష్యూస్ అనేవి మన చేతులు, కాలి ఎముకలు, మజిల్స్, నరాలు, ఫ్యాట్ రక్త వాహికల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైంది ఎంటంటే Sarcoma Cancer వచ్చినప్పుడు చాలా ఆలస్యంగా గానీ బయటపడదు. దాంతో చికిత్స కష్టమైపోతుంది. Sarcoma Cancer కూడా 70 రకాలుగా ఉంటుంది. ఇదొక అత్యంత అరుదైన కేన్సర్ రకం. 

Sarcoma Cancer అనేది తల నుంచి కాలి వేళ్ల వరకూ శరీరంలోని చాలా భాగాల్లో అభివృద్ధి చెందుతుంది. 40 శాతం వరకూ కడుపు, మడమ, పాదంపై వస్తుంది. 15 శాతం భుజాలు, చేతులు, అరచేతుల్లో రావచ్చు. 30 శాతం నడుము, ఛాతీ, కడుపు, పెల్విక్స్‌లో వస్తుంది. 15 శాతం తల, మెడలో వస్తుంది. 

Sarcoma Cancer లక్షణాలు

Sarcoma Cancer లక్షణాలు ట్యూమర్‌లా ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో ప్రారంభ దశలో లక్షణాలే కన్పించవు. కొంతమందిలో చర్మం అడుగున నొప్పి ఉండే కణితి ఉన్నట్టు అన్పిస్తుంటుంది. ఇంకొంతమందిలో నొప్పి లేనంతవరకూ ఎలాంటి వృద్ధి లేకుండా ఉంటాయి. కొన్ని కేసుల్లో దీర్ఘకాలిక లక్షణాలు ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు కన్పించవచ్చు. రాత్రి సమయంలో ఇదెక్కువగా ఉంటుంది. 

కొత్తగా కణితి కన్పిస్తుంది. అది నొప్పిగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా. చేతులు, కాళ్లు, కడుపు, పెల్విక్స్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాళ్లు, చేతులు కదపడంలో సమస్య తలెత్తవచ్చు. హఠాత్తుగా బరువు తగ్గడం, బ్యాక్ పెయిన్ ప్రధానంగా ఉంటాయి. 

Also read: Stroke Signs: స్ట్రోక్ లక్షణాలెలా ఉంటాయి, గోల్డెన్ అవర్‌లో తక్షణం ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News