Side Effects Of Black Coffee: కాఫీ మైండ్‌ను రిలీప్ చేసే ప్రత్యేకమైన ఓ ఔషధం లాంటిది. చాలా మంది కాఫీని విచ్చల విడిగా తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ దీనిని ఖాళీ కడుపుతో తాగొద్దని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు ఖాళీ కడుపుతో తాగడం వల్ల తీవ్ర పొట్ట సమసత్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించడమేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున దీనిని ఖాళీ కడుపుతో తీసుకోకపోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి:
నిద్ర సమస్యలు:
కాఫీ, టీలో కెఫిన్ అనే రసాయనం అధిక పరిమాణంలోఉంటుంది. అయితే టీలను అతిగా తీసుకుంటే శరీరంలో ఈ రసాయానాల భారీగా వెళ్లే అవకాశాలున్నాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినడం.. వంటి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
అజీర్ణం:
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగే..జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశాలున్నాయి. దీనిని తరచుగా తీసుకున్న ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పడికే జీర్ణ సమస్యలు ఉంటే.. బ్లాక్ టీని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మధుమేహం:
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గించి రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఖాళీ కడుపుతో బ్లా కాఫీని తీసుకోకపోవడం చాలా మంచిది.
రక్తపోటు:
హైబీపీ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని బీపీ స్థాయిలను పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీరు ఈ కాఫీలకు బదులుగా గ్రీన్ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook