Summer Tips: ఈసారి వేసవికాలం ఇంకా దారుణంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక మేలో ఎండలు ఇంకెలా ఉంటాయో అని.. అందరిలోనూ భయం కూడా మొదలైంది. ఈ సమయంలోనే ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం.. సరైన ఆహారం తీసుకోవటం ముఖ్యం.
ముఖ్యంగా వేసవికాలంలో సూర్యుడి వేడి కారణంగా.. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా.. మన శరీరంలోని నీటిశాతం తగ్గిపోతుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మన శరీరాన్ని హైడ్రేట్ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పళ్ళరసాలు తాగితే ఇంకా మంచిది..
సమ్మర్ లో వేడినుంచి కాపాడగల శక్తి ఉన్న ఫ్రూట్స్ లో పైనాపిల్ ఒకటి. తీయగా, పుల్లగా ఉండే పైనాపిల్ వల్ల.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పైనాపిల్ లో ఉండే వాటర్ కంటెంట్.. ఈ వేడి నుంచి మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. పైనాపిల్ లో కాపర్, మాంగనీస్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్, వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా వేసవిలో పైనాపిల్ జ్యూస్ తాగడం.. లేదా పైనాపిల్ ముక్కలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
పైనాపిల్ వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పైనాపిల్ లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పొడి పారిపోకుండా చూసుకుంటూనే.. చర్మంపై ఉన్న మచ్చలను తొలగించి.. సహజంగా కాంతివంతంగా మారుస్తాయి.
పైనాపిల్ లో ఉండే విటమిన్ సి కంటెంట్.. రోగాలతో పోరాడే శక్తిని మన శరీరానికి ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా.. మన బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పైనాపిల్ తిన్న వెంటనే మనకి ఎనర్జీ కూడా వస్తుంది. అలా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పైనాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియకి బాగా ఉపయోగపడతాయి. అజీర్తి, గ్యాస్ వంటివి రాకుండా కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
పైనాపిల్ ఎలాంటి వారైనా తినొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కూడా పైనాపిల్ ని హాయిగా తినొచ్చు.. అని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ తినడం వల్ల గుండె జబ్బులు కూడా మన జోలికి రావు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
పైకి ముళ్ళతో కనిపించే పైనాపిల్ లోపల ఇన్ని ప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి మన మనం రోజు తీసుకునే ఆహారంలో పైనాపిల్ ని కూడా చేర్చడం.. జ్యూస్ లాగానో.. సాలడ్ లాగానే చేర్చడం.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Also read: Special Trains: గుడ్ న్యూస్..ఎన్నికల పండగ వేళ ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook