Improve Eyesight Food: కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషక ఆహారం లోపించడం వల్ల కంటి సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కంటి చూపు మెరుగుగా ఉండాలి అంటే డ్రై ఫ్రూట్స్‌ను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కంటి చూపు బాగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుగా కనిపిస్తుంది. అందులో బాదం, వాల్నట్, పిస్తా, ఎండిన ఆప్రికాట్లు, ఎండుద్రాక్ష, ఎండిన బ్లూబెర్రీస్, గోజీ బెర్రీలు తీసుకోవడం చాలా మంచిది. వీటిలో అధికంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా AMD , కంటిశుక్లం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి.
కంటి చూపుకు డ్రై ఫ్రూట్స్:
వాల్నట్లు:
వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఒమేగా-౩ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారడం వంటి పరిస్థితులను నివారించడానికి ఉపయోగపడతాయి.
బాదం:
బాదం తీసుకోవడం వల్ల కంటి శుక్లం నుంచి రక్షిణ కలుగుతుంది. బాదంలో వటమిన్ ఇ లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల AMD అలాగే కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది.
పిస్తా:
పిస్తా తీసుకోవడం వల్ల కళ్లను రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది. పిస్తాలో యాంటీఆక్సిడెంట్లు, జియాక్సంతిన్ల, లుటీన్ వంటి మంచి గుణాలు ఉంటాయి. ఇవి హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది.
ఎండు ఆప్రికాట్లు:
ఎండిన ఆప్రికాట్లలో విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల కంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.
ఎండు ద్రాక్ష:
ఎండు ద్రాక్షలో విటమిన్ ఎ ఉంటుంది. కళ్లను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
ఎండిన బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్ కంటెంట్, ముఖ్యంగా ఆంథోసైనిన్లు కలిగి ఉంటాయి. కళ్ళలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎండిన గోజీ బెర్రీలు:
గోజీ బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి వయస్సు సంబంధిత కళ్ళ సమస్యల నుంచి రక్షించడానికి మంచి దృష్టిని నిర్వహించడానికి దోహదం చేస్తాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter