Immunity Boost: మారుతున్న సీజన్లో ఈ 6 ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు మీ పిల్లల డైట్లో ఉండాల్సిందేనట.. 

Immunity Boosting Foods For Children: మారుతున్న సీజన్‌లో పిల్లల ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 21, 2024, 11:02 AM IST
Immunity Boost: మారుతున్న సీజన్లో ఈ 6 ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు మీ పిల్లల డైట్లో ఉండాల్సిందేనట.. 

Immunity Boosting Foods For Children: మారుతున్న సీజన్‌లో పిల్లల ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. దీంతో వాళ్లు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలంటే మన ఆహారంలో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సిట్రస్‌ పండ్లు మీ డైట్లో ఉండాలి. గింజలు, ఆకుకూరలలో జింక్‌ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తాయి.

పసుపు పాలు..
పసుపులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. పసుపు పాలను గోల్డెన్‌ మిల్క్‌ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉంటుంది. మీ పిల్లలకు ప్రతిరోజూ పసుపు పాలను ఇస్తే సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం లేదా ప్రతిరోజూ పడుకునే ముందు పసుపు పాలను మీ పిల్లలకు ఇవ్వండి ఇది వారి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

బాదం..
బాదంలో కూడా విటమిన్‌ ఇ పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కూడా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ముఖ్యంగా బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌ మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తిని కూడా పెంచుతుంది. ఓ గుప్పెడు బాదంలను మీ పిల్లల డైట్లో చేర్చండి దీంతో వారి ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఈ చల్లని వాతావరణంలో వారు జబ్బుల బారిన పడకుండా ఉంటారు. బాదం తొక్కతీసి నానబెట్టుకుని తినాలి. 

పండ్లు, యోగర్ట్‌..
యోగర్ట్‌ అంటేనే మంచి ప్రొబయోటిక్‌ ఇది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగర్ట్‌తోపాటు పండ్లు జత చేసుకుని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా బొప్పాయి, దానిమ్మ, బెర్రీ, బాదం వంటివి యోగర్ట్‌లో వేసుకుని స్నాక్‌ మాదిరి తీసుకోవాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ పిల్లల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడమే కాదు మీ పిల్లలు ఆస్వాదిస్తూ తింటారు.

ఇదీ చదవండి: టీ తాగుతూ ఈ 5 ఫుడ్స్‌ తింటున్నారా? మీరు తప్పు చేస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త..

వెల్లుల్లి వేసి వేయించిన కూరగాయలు..
వెల్లుల్లిలో యాంటీ మైక్రోబ్రియల్‌, ఇమ్యూన్‌ బూస్టింగ్‌ గుణాలు ఉంటాయి. క్యారట్‌, బెల్‌ పెప్పర్స్‌, స్వీట్‌ పొటాటోలు వెల్లుల్లి వేసి వేయించిన కూరలు మీ పిల్లలకు పెట్టాలి. ఇది పోషకాలు కలగలిపిన డిష్‌. ఈ స్నాక్‌ లో మినరల్స్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. మారుతున్న సీజన్లలో మీ పిల్లల డైట్లో చేర్చండి వారి ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.

పాలకూర..
పాలకూరలో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్‌, విటమిన్‌ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థకు పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. మారుతున్న సీజన్లలో మీ పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పాలకూరను డైట్లో చేర్చండి. ఇందులో ఐరన్‌ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అంతేకాదు పాలకూరలోని విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్‌ సమస్య నుంచి మన శరీరాన్ని కాపాడతాయి.

ఇదీ చదవండి: వెల్లుల్లి రసం పరగడుపున తాగితే.. ఈ ప్రయోజనలన్నీ మీ సొంతం..

సిట్రస్‌ పండ్లు..
సిట్రస్‌ పండ్లు డైట్లో చేర్చడం వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఆరెంజ్‌, నిమ్మకాయ, లైమ్‌ వంటి పండ్లలో విటమిన్‌ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. వీటిని టాపింగ్‌ మాదిరి తీసుకోవచ్చు. జ్యూస్‌ రూపంలో పిల్లలకు ఇవ్వచ్చు. చియా సీడ్స్, బాదం కూడా వేసి ఇస్తే రుచి బాగుంటుంది. మారుతున్న సీజన్లలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News