Cholesterol increases Sign: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే చాలా రకాల సమస్య ఎదురువుతాయి. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చాలా మంది బరువు పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది మంచి కొవ్వు, రెండవది చెడు కొలెస్ట్రాల. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే గుండెపోటు( హార్ట్ స్ట్రోక్) వచ్చే అవకాశాలున్నాయి. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందో..దానిని నివారించడానికి మార్గాలు ఏమిటో తెలుసుకుందా..
1. గుండెపోటు వచ్చే అవకాశాలు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున చెడు కొవ్వు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించి.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. బ్రెయిన్ స్ట్రోక్:
అంతే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపు తప్పితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మెదడుకు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
3. కంటి చూపు కూడా కోల్పోవచ్చు:
శరీరంలో చెడు కొవ్వు పెరగడం వల్ల కంటి చూపు కూడా పోయే అవకాశాలున్నాయి. వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కళ్లకు జరిగే రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో కళ్ల చూపు కూడా పోతుందని వైద్యులు తెలిపారు.
4. కిడ్నీలలో సమస్యలు:
శరీరంలో కొవ్వు స్థాయి పెరిగినప్పుడు అది మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఈ పని చేయండి:
#తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
# రోజు వ్యాయామం చేయండి.
#ఒత్తిడికి దూరంగా ఉండండి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rare Video: అద్భుతం.. మేఘాలను తాకుతున్న అలలు.. వైరల్ వీడియో!
Also Read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Cholesterol increases Sign: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ ప్రమాదం తప్పదు..!
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ప్రమాదం
గుండెపోటు వచ్చే అవకాశాలు
కంటి చూపు కూడా కోల్పోవచ్చు