ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ నియంత్రణ చాలా ముఖ్యం. లేకపోతే ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుంది. అలోవెరాతో థైరాయిడ్ అద్భుతంగా నయమౌతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
థైరాయిడ్ అనేది శరీరంలో మెడభాగంలో ఉండే ఒక గ్రంధి. ఈ గ్రంథి దైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ప్రభావం శరీరంలోని వివిధ ప్రక్రియల్ని నియంత్రిస్తుంది. ఈ ప్రక్రియలో తేడా వస్తే..పలు సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్య ఉండేవారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేకించి లైఫ్‌స్టైల్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. థైరాయిడ్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.
అలోవెరా జ్యూస్‌తో లాభాలు
థైరాయిడ్ ఉన్నప్పుడు అలోవెరా జ్యూస్ అద్భుత ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనికోసం రోజూ ఉదయం తులసి ఆకులు కలిపి అలోవెరా జ్యూస్ తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అలోవెరా జ్యూస్ రోజూ పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలున్నాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఈ సమస్యకు అలోవెరా జ్యూస్ చాలా ప్రయోజనకరం. అయితే క్రమం తప్పకుండా రోజూ సేవించాలి. జాయింట్ పెయిన్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అలోవెరా జ్యూస్ నిర్ణీత పద్థతిలో తీసుకోవాలి. పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. రెండు స్పూన్స్ అలోవెరా జ్యూస్‌లో తులసి ఆకుల రసం కలపాలి. రోజూ తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయి.
Also read: Beauty Care Tips: స్నానం తరువాత ఇలా చేస్తే చాలు..వయస్సు మీదపడినా అందం, యవ్వనం తగ్గదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook