High BP: హై బీపీ ఉందా..? ఈ పద్ధతులు పాటించండి.. బీపీకి దూరంగా ఉండండి!

హై బీపీ.. ఇపుడు ఇది అందరిలోనూ సర్వసాధారణం అయింది. దీని వలన అనేకరకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతాయి. ఈ పద్దతులను అనుసరిస్తే హై బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 08:41 PM IST
High BP: హై బీపీ ఉందా..? ఈ పద్ధతులు పాటించండి.. బీపీకి దూరంగా ఉండండి!

High Blood Pressure Control Tips: ప్రస్తుత కాలంలో అధిక రక్తపాటు సాధారణంగా ఆరోగ్య సమస్యగా మారింది. హై  బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడానికి చాలా మంది అనేక చిట్కాలను అనుసరిస్తుంటారు. కానీ వారు అనుసరించే జీవన శైలిలో మార్పులు చేసుకోనంత వరకు దీని నుండి ఉపశమనం పొందలేరు. చెడు ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.  

అధిక రక్తపోటుని నియంత్రించే చిట్కాలు  

తక్కువ మొత్తంలో సోడియం 
సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు కలుగుతుంది. కావున మీరు అధికంగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. సోడియం ఎక్కువగా తీసుకోవడం వలన అనేక  సమస్యలు కలగవచ్చు. 

ఎక్కువగా పొటాషియం 
అధిక రక్తపోటు కలిగిన వారు వారి డైట్ లో పొటాషియం పరిమణాన్ని పెంచుకోవాలి,దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కావున పొటాషియం ఎక్కువగా ఉండే పదార్ధాలను తినడం మంచిది.     

Also Read: Oppo Find N3 Flip Price: Oppo Find N3 Flip మొబైల్‌పై రూ. 47,150 వరకు తగ్గింపు..అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

రోజు వ్యాయామాలు 
అసలు వ్యాయామం చేయని వారు రోజు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే ఎక్కువ వ్యాధులు వ్యాయామం చేయకపోవడం వల్లే కలుగుతాయి. దాని వల్ల బీపీ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  

ధూమపానానికి దూరం 
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికి తెలిసిందే. అయినా కొంత మంది ఈ అలవాటుని మానుకోరు. కానీ ధూమపానం చేయడం వల్ల ఎన్నో ఇతర పెద్ద సమస్యలు కలుగుతాయి.వాటిల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి.

Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

 

Trending News