COVID booster shot: కరోనా బూస్టర్ డోస్ తర్వాత కనిపిస్తున్న లక్షణాలు

COVID booster shot: కరోనా బూస్టర్​ డోసు తర్వాత చాలా మందిలో విచిత్రమైన సైడ్ ఎఫెక్ట్​ను గుర్తించారు. ఆ సైడ్ ఎఫెక్ట్​ ఏమిటి? దానిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 06:37 PM IST
  • కరోనా బూస్టర్ డోసు తర్వాత కొత్త రకం సైడ్ ఎఫెక్ట్​
  • వింత రుచి అనుభూతి చెందుతున్నట్ల వెల్లడి
  • కొత్త లక్షణాలపై వైద్య నిపుణుల వివరణ
COVID booster shot: కరోనా బూస్టర్ డోస్ తర్వాత కనిపిస్తున్న లక్షణాలు

COVID booster shot: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం, చలి, చేతుల్లో నొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంపై ఇప్పటికే వైద్య నిపుణులు వివరణ కూడా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత అలాంటి లక్షణాలు కనిపిస్తే.. కరోనా టీకా బాగా పని చేస్తోందనేందుకు సంకేతమని వెల్లడించారు.

అయితే ఇటీవలి కొవిడ్ నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్​ డోసు తీసుకుంటున్నారు చాలా మంది. అయితే మూడో డోసు తీసుకున్న వారిలో చాలా మంది కొత్త రకం సైడ్ ఎఫెక్ట్స్​ వస్తున్నట్లు చెప్పారు. ఇంకా మొదటి రెండు డోసులతో పోలిస్తే.. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటున్నాయని కూడా వెల్లడించారు.

కొత్త లక్షణాలు ఏవి?

బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది రుచిని చూసే స్వభావం తాత్కాలికంగా కోల్పోయినట్లు తెలిపారు. ముఖ్యంగా నోట్లో లోహన్ని రుచి చూసిన అనుభూతి కలగిందని చెప్పారు.

అయితే ఈ టీకా తీసుకున్న తర్వాత కూడా ఆరోగ్యంగా ఉన్న వారిలోనూ కనిపించడం గమనార్హం. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ లక్షణాలను గుర్తించినట్లు చెప్పారు.

తొలి కేసు ఎక్కడ నమోదందైంటే..

టీకా తీసుకున్న తర్వాత నోట్లో లోహాన్ని రుచిని అనుభూతి చెందుతున్నట్లు గత ఏడాది అమెరికాలో కొంత మంది వైద్యుల దృష్టికి తీసుకెల్లారు. నికేల్ లోహం నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అనుభూతినే తాము అనుభవిస్తున్నట్లు చెప్పారు.

అయితే ఈ లక్షణాన్ని ఇంకా కరోనా టీకా సైడ్​ ఎఫెక్ట్స్ జాబితాలో చేర్చలేదు వైద్యులు.

అయితే ఇలాంటి అనుభూతి కేవలం కొవిడ్ టీకా తీసుకుంటే మాత్రమే కాకుండా.. ఇతర రోగాలకు టీకా వేసుకున్నా అనుభూతి చెందుతారని వైద్యులు అంటున్నారు. చాలా టీకాల్లో ఇది సాధారణమైన లక్షణంగా పేర్కొన్నారు.

ఇలాంటి లక్షణాలకు కారణాలు..

అయితే కరోనా బూస్టర్​ డోసు తీసుకున్న తర్వాత నోట్లో ఇలా లోహానికి సంబంధించిన రుచి అనుభూతి ఎందుకు కలుగుతుంది? అనే విషయాన్ని ఇంకా వైద్యులు దృవీకరించలేకపోతున్నారు.

అనారోగ్యం పాలైనప్పుడు.. చేదుగా లేదా ఉప్పగా లేదా వగరుగా నోట్లో రుచి ఉండటం సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఇలా మెటాలిక్ రుచి రావడం అనేది చాలా అరుదుగా జరిగే పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ లక్షణాలు తాత్కాలికమైనవేనని.. వాటి వళ్ల ప్రమాదం లేదని వైద్యులు అంటున్నారు. కొన్ని రోజులు ఆ లక్షణాలు కనిపించినా.. ఎలాంటి వైద్యం లేకుండానే ఆ లక్షణాలు పోతాయని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు నోటి ద్వారా తీసుకునే మందుల వల్ల కూడా ఇలా జరగొచ్చని అంటున్నారు.

Also read: Millet Benefits: మిల్లెట్స్ తో షుగర్, కొలెస్ట్రాల్, అధిక బరువుకు చెక్ పెట్టండిలా?

Also read: Badam Tea: బాదం టీ ఆరోగ్యానికి మంచిదా కాదా, బాదంను ఏ రూపంలో తీసుకోవాలి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News