Vinegar Onion Benefits: ఉల్లిపాయ ఆహారాల రుచిని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అందుకే భారతీయులు ప్రతి వంటకంలో ఉల్లిపాయలను వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రతి రోజు ఉల్లిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశనం కలిగిస్తుంది. అయితే పచ్చి ఉల్లిపాయలను వెనిగర్‌లో కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెనిగర్‌లో నానబెట్టిన ఉల్లిపాయలను ఎలా తినాలో తెలుసా?
తెల్ల ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయ కంటే ఆరోగ్యకరమైనవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో వెనిగర్‌లో కలిపి తీసుకుంటే శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
బ్లడ్ షుగర్ అదుపులో ఉంటాయి:
ఉల్లిపాయలో అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు వెనిగర్‌లో నానబెట్టిన ఉల్లిపాయలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ప్రతి రోజు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా 30% శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
క్యాన్సర్ రిస్క్..
ఉల్లిపాయ తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు పొట్ట, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా సులభంగా దూరమవుతాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook