Vitamin 'B' rich Foods: శరీరంలో విటమిన్ బి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి లోపముంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. సాధారణంగా విటమిన్ బి అంటే నాన్‌వెజ్ ఆహారంలోనే ఎక్కువగా లభిస్తుందని అంటారు. కానీ శాకాహారంలో కూడా విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వివిధ రకాల పోషకాల్లానే విటమిన్ బి మనిషి శరీరానికి చాలా అవసరం. విటమిన్ బి లేకపోతే అలసట, బలహీనత, బద్ధకం, ఒళ్లు నొప్పులు, చేతులు, కాళ్లు తిమ్మిరెక్కడం, ఎనర్జీ లేకపోవడం వంటి రకరకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. విటమిన్ బి కావాలంటే చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటి నాన్‌వెజ్ పుఢ్స్ తప్పనిసరిగా తినాలని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని శాకాహార పదార్ధాల్లో కూడా విటమిన్ బి సమృద్ధిగా లభిస్తోంది.
నల్ల శెనగలు, పచ్చ బఠానీలు, కాబూలీ శెనగలు, రాజ్మాలను సాధారణంగా ప్రోటీన్ల కోసం తీసుకుంటుంటారు. కానీ ఇందులో విటమిన్ బి కూడా పెద్దమొత్తంలో లభిస్తుంది. విటమిన్ బి కోసం ఈ పదార్ధాలు మంచి ప్రత్యామ్నాయాలు
పాలు
పాలను సాధారణంగా కంప్లీట్ ఫుడ్‌గా లేదా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలున్నాయి. దీంతో పాటు విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. పన్నీరు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ బి ఇందులో పెద్దమొత్తంలో లభిస్తుంది.
Also Read: Thirst Symptoms: పదే పదే దాహం వేస్తుంటే నిర్లక్ష్యం వద్దు, ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు
సన్‌ఫ్లవర్ సీడ్స్
సన్‌ఫ్లవర్ సీడ్స్ అనేవి ఆరోగ్యానికి ప్రయోజనకరం. సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను వంటరూపంలో లేదా ఆయిల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి, నియాసిన్, ఫోలేట్ సమృద్దిగా లభిస్తాయి.
ఆకు పచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి ఫెరెవర్ బెస్ట్‌గా చెప్పవచ్చు. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. రోజూ డైట్‌లో పాలకూర, తోటకూర, అరటి వంటి పదార్ధాలు సేవిస్తే విటమిన్ బి కొరత తీరుతుంది. అన్ని కూరగాయలతో జ్యూస్ చేసి తాగితే ఇంకా మంచిది. అయితే ఇలా చేసేముందు ఆకుల్ని గోరువెచ్చని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి.
Also Read: Thirst Symptoms: పదే పదే దాహం వేస్తుంటే నిర్లక్ష్యం వద్దు, ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook