శరీర నిర్మాణం కోసం ప్రతి ఒక్క పోషక పదార్ధం చాలా అవసరం. ఏ మాత్రం తక్కువైనా వివిధ రకాల వ్యాధుల ముప్పు ఉంటుంది. శరీరానికి కావల్సిన అత్యంత ముఖ్యమైన పోషకం విటమిన్ బి12. శరీరంలోని ప్రతి క్రియకు విటమిన్ బి 12 అత్యంత కీలకం. అందుకే తీసుకునే డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. విటమిన్ బి 12 లోపం నుంచి కాపాడుకునేందుకు రోజూ డైట్‌లో కొన్ని వస్తువులు చేర్చాల్సిందే. 

శరీరంలో విటమిన్ బి 12 ప్రాముఖ్యత

1. విటమిన్ బి 12 అనేది శరీరంలో సెల్స్ నిర్మాణంలో కీలక భూమిక వహిస్తాయి. ఎముకల్ని బలోపేతం చేస్తుంది. చర్మం, గోర్లు, కేశాలను పటిష్టం చేస్తుంది. విటమిన్ బి 12 తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.

2. విటమిన్ బి12 రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో చాలా దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపంతో రెడ్ బ్లడ్ సెల్స్ నియంత్రణ దాటేస్తాయి. ఫలితంగా మెగోబ్లాస్టిక్ ఎనీమియా సమస్య ఏర్పడవచ్చు.

3. విటమిన్ బి 12 అనేది నాడీ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. మెదడు వృద్ధికి కీలకంగా ఉపయోగపడుతుంది. గర్భిణీ మహిళలు విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాల్ని తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కడుపులో బిడ్డ ఎదుగుదలకు విటమిన్ బి12 కీలకంగా ఉపయోగపడుతుంది.

4. విటమిన్ బి12 అనేది కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ బి 12 సరైన మోతాదులో ఉంటే గుండె సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

5. విటమిన్ బి 12 కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ బి 12 జీవక్రియను మెరుగుపరుస్తుంది. 

6. విటమిన్ బి 12 డీఎన్ఏ రెప్లికేషన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపంతో డీఎన్ఏలో సమస్య ఏర్పడుతుంది. 

విటమిన్ బి 12 లోపం సరిచేసే పదార్ధాలు

విటమిన్ బి 12 లోపాన్ని దూరం చేసేందుకు డైట్‌లో కొన్ని ముఖ్యమైన పదార్ధాలను చేర్చుకోవాలి. దీనివల్ల పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. చేపల్లో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. ట్యూనా, సాల్మన్ చేపల్లో విటమిన్ బి12 పెద్దమొత్తంలో ఉంటుంది. దీంతోపాటు గుడ్లు, చికెన్, మాంసంలో కూడా విటమిన్ బి12 ఎక్కువ మోతాదులో లభిస్తుంది. పాలు, పెరుగు, పన్నీరు వంటివాటిలో కూడా విటమిన్ బి 12 చాలా ఎక్కువగా ఉంటుంది. 

కొన్ని రకాల కూరగాయలైన బ్రోకలీలో కూడా విటమిన్ బి 12 చాలా ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్స్, ఓట్స్‌లో విటమిన్ బి 12 ఎక్కువగా లభిస్తుంది. 

Also read: TB Cough Sympmtoms: సాధారణ, టీబీ దగ్గులో అంతరమేంటి, ఎలా గుర్తించవచ్చు, ఏ లక్షణాలుంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Vitamin B12 deficiency symptoms and causes leds to diseases add these foods to your diet to check vitamin b12 deficiency
News Source: 
Home Title: 

Vitamin B12: విటమిన్ బి 12 లోపముంటే ఏమౌతుంది, ఏం తింటే మంచిది

Vitamin B12: విటమిన్ బి 12 లోపముంటే ఏమౌతుంది, ఏం తింటే మంచిది
Caption: 
Vitamin B12 symptoms ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Vitamin B12: విటమిన్ బి 12 లోపముంటే ఏమౌతుంది, ఏం తింటే మంచిది
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, February 27, 2023 - 10:15
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
96
Is Breaking News: 
No

Trending News