Weight Gain Diet: బరువు పెరగాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. ఇలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారు..

Weight Gain Diet: బరువు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తగ్గడం వల్ల కూడా అలాంటి సమస్యలే వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలామంది పోషకాహార లోపం వల్ల శరీర బరువు తగ్గిపోతున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 01:12 PM IST
  • బరువు పెరగాలనుకుంటున్నారా..
  • అయితే రోజూ ఆహారంలో భాగంగా గుడ్లను తీసుకోండి
  • సులభంగా బరువు పెరుగుతారు
Weight Gain Diet: బరువు పెరగాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. ఇలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారు..

Weight Gain Diet: బరువు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తగ్గడం వల్ల కూడా అలాంటి సమస్యలే వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలామంది పోషకాహార లోపం వల్ల శరీర బరువు తగ్గిపోతున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా చాలామంది బరువు పెరగడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే బరువు తగ్గడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరగడానికి క్రమం తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాలి:

గుడ్లు:
కోడిగుడ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని ఉడకబెట్టుకుని తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. బరువు పెరగడానికి తప్పకుండా రోజుకి రెండు నుంచి మూడు గుడ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆమ్లెట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఓట్స్:
బరువు తగ్గడానికి ఓట్స్ ఎంత ఉపయోగపడతాయో బరువు పెరగడానికి కూడా అంతే ఉపయోగపడతాయి.  కానీ వీటిని తీసుకునే క్రమంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓట్స్ను వండుకునే క్రమంలో తప్పకుండా అధిక ప్రోటీన్లు ఉన్న వేరుశనగలను అంతేకాకుండా వెన్నెను వేసి.. ఒక మిశ్రమంలో తయారు చేసుకొని.. వాటిలో ఆ రెండు పండు ముక్కలను వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గుతారు.

అరటి పండ్లు:
అరటి పండ్లలో కూడా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి వీటిని బరువు పెరగాలనుకునేవారు రోజు రెండు చొప్పున ఉదయం పూట.. అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా వీటిని షేక్ లా చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు తప్పకుండా పైన పేర్కొన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు అనుకున్నంత బరువు పెరుగుతారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News