Weight Loss With Desi Ghee: శరీర బరువును తగ్గించుకోవడానికి చాలామంది కఠిన తరమైన వ్యాయామాలతో పాటు డైట్లను కూడా పాటిస్తారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాన్ని పొందలేక పోతారు. అయితే బరువు తగ్గడానికి మేము ఈరోజు ఓ సీక్రెట్ చిట్కాను మీకు తెలుపబోతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా కండరాలు దృఢంగా మారుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తినడం మానుకుంటారు. అని మేము ఈరోజు మీకు తెలుపబోయే చిట్కాను చూస్తే ఆశ్చర్యానికి గురవుతారు. ఆ చిట్కా ఏమిటంటే..మనం ఇంట్లో వాడే నెయ్యితో కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఈ నెయ్యిని వేడినీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుందని అధ్యయనంలో పేర్కొన్నాయి. అంతేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాలను కూడా సులభంగా తగ్గించి చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని అధ్యయనంలో తేలింది.
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడమే కాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరానికి విటమిన్ ఇ ని కూడా అందిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ చిట్కాను ఈ చిట్కాను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
నెయ్యిలో లభించే పోషకాలు:
నీరు 0.5 గ్రా, కేలరీలు 900 కేలరీలు, శక్తి 3766 కిలోజౌల్స్, కొవ్వు 100 గ్రా, విటమిన్ A 4000 IU, కొవ్వు ఆమ్లాలు, మొత్తం సంతృప్త 60.000 గ్రా, కొవ్వు ఆమ్లాలు, మొత్తం బహుళఅసంతృప్త 4.000 గ్రా, కొలెస్ట్రాల్ 300 mg.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.