Weight Loss Tips: సోపు, జీరా వాటర్‌తో కేవలం 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Weight Loss With Jeera Water In 7 Days: అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది తొందరగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే బరువు పెరిగేందుకు చాలా రకాల ఉత్పత్తులను వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.

Last Updated : Aug 24, 2022, 12:48 PM IST
  • ప్రతి రోజూ సోపు, జీరా వాటర్‌ను
  • ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల..
  • కేవలం 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు
 Weight Loss Tips: సోపు, జీరా వాటర్‌తో కేవలం 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Weight Loss With Jeera Water In 7 Days: అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది తొందరగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే బరువు పెరిగేందుకు చాలా రకాల ఉత్పత్తులను వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. నేచురల్‌గా బరువు తగ్గడానికి పలు చిట్కాలను కూడా వినియోగిస్తున్నారు. వీటి వల్ల కూడా సులభంగా బరువు తగ్గలేక పోతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది జీర్ణక్రయ సమస్యల బారిన పడుతున్నారు. బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా జీలకర్ర, సోపుతో తయారు చేసిన నీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయని  కాబట్టి మీరు ప్రతిరోజూ జీలకర్రతో కూడిన నీటిని తీసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలా ఈ బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు:

జీవక్రియ మెరుగుపడుతుంది:
సహజసిద్ధంగా శరీర సమస్యలకు చెక్‌ పెట్టేందుకు...జీలకర్ర, సోపు నీరు ప్రభావవతంగా పని చేస్తుంది. అయితే చాలా మందిలో జీవక్రియ సమస్యల వల్లే బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ నీటిని తీసుకోవడం వల్ల  క్యాలరీలను వేగంగా తగ్గి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ నీటి వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగి.. సైక్లింగ్ లేదా వాకింగ్ చేస్తే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.

జీర్ణ వ్యవస్థ:
మెరుగైన జీర్ణక్రియ వక్తి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. దీని వల్లే బరువు పెరగడం.. తగ్గడం వంటి మార్పులు ఏర్పడతాయి. కావున జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. జీర్ణక్రియ మెరుగుపడితే..బ్లడ్ లెవెల్‌ కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా స్థూలకాయం సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. కావున జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి:
ఈ నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కావున బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిలో ఉండే గుణాలు పేరుకుపోయి కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించి.. బరువు తగ్గడానికి కృషి చేస్తాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News