Symptoms Of High Blood Sugar: ప్రపంచ వ్యాప్తంగా పత్రిఒక్కరిని వేధించే సమస్య డయాబెటిస్. కొన్ని పరిశోధనలలో భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలుస్తోంది. డయాబెటిస్ అనేది అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కలిగే సమస్య. డయాబెటిస్ ఉన్నవారు ఈ లక్షణాలు కనిపిస్తే మీలో అధిక షుగర్ లెవెల్స్ పెరిగినట్లే. అయితే అధిక షుగర్ వల్ల కలిగే లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
తీవ్రమైన మూత్రవిసర్జన:
డయాబెటిస్ మొదటి లక్షణం సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేయడం జరుగుతుంది. శరీరంలోని అదనపు షుగర్ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. అయితే బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే రాత్రిపూట కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
విపరీతమైన చెమట:
ఎక్కువగా బ్లడ్ షుగర్ ఉన్నవారు రాత్రిపూట కూడా ఎక్కవ చెమట పట్టడం జరుగుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను కూడా ప్రభావితం చేస్తుంది.
విపరీతమైన దాహం:
శరీరంలోని అదనపు షుగర్‌ను వదిలించుకోవడానికి తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా దాహం అవుతుంది. రాత్రిపూట దాహం తీవ్రంగా ఉంటుంది.
పాదాల:
రాత్రిపూట మాత్రమే కాళ్ళలో చాలా చికాకుగా ఉన్నట్లు, పాదాలలో అసౌకర్యం కారణంగా మీరు మంచి నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు కలుగుతే మీరు రక్తంలో షుగర్ ఎక్కువగా ఉన్నట్లు అర్థం.
Also Read Nutmeg Benefits: మిల్క్‌లో జాజికాయ పొడిని కలుపుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు!
శారీరక అలసట:
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు అలసట, నీరసం వంటి లక్షణాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దీని కారణంగా శరీరానికి తగినంత శక్తి ఉండదు.
స్లీప్ అప్నియా:
స్లీప్ అప్నియా అనేది హై బ్లడ్ షుగర్ రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ సమస్య ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతుంటారు. రాత్రిపూట పై లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోండ చాలా మంచిది. దీని వల్ల మీరు బ్లడ్ షుగర్ సమస్య నుంచి బయటపడుతారు. పరీక్షలు చేసుకోకుండా ఉంటే మీరు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter