ఆరోగ్యంపై ప్రభావం చూపించే వివిధ రకాల వ్యాధులకు సంకేతాలు వివిధ రూపాల్లో వెలుగుచూస్తూనే ఉంటాయి. అందులో ఒకటి గోర్లపై ఏర్పడే తెల్లటి మచ్చలు. ఈ మచ్చలుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రమాదకర ల్యూకోనీషియా కావచ్చు.
చేతి వేళ్లకుండే గోర్లు ఆరోగ్యానికి సంబంధించిన చాలా అంశాల్ని సూచిస్తుంటాయి. శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే..ముందుగా గోర్లపై ఆ ప్రభావం కన్పిస్తుంది. గోర్లపై తెల్లటి మచ్చలు కన్పిస్తే దాని వెనుక చాలా కారణాలుండవచ్చు. గోర్లపై తెల్లటి మచ్చలకు కారణం సాధారణమైంది మాత్రం కాదంటున్నారు. ల్యుకోనీషియా కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ల్యుకోనీషియా అనేది గోర్లకు గాయం ఏర్పడితే వస్తుంది. గోర్లు పాడైపోతాయి. రంగు మారుతుంది. అసలు గోర్లపై తెల్లటి మచ్చలకు కారణాలేంటనేది తెలుసుకుందాం..
గోర్లపై తెల్లటి మచ్చలకు కారణాలు
ఎలర్జిక్ రియాక్షన్
గోర్లపై తెల్లడి మచ్చల వెనుక కారణం ఎలర్జిక్ రియాక్షన్ కూడా కావచ్చు. నెయిల్ పాలిష్, గ్లాస్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ సైతం కారణం కావచ్చు. గోర్లపై తెల్లటి మచ్చలు ఎలర్జీ కారణంగా కూడా వస్తుంటాయి. ఆర్టిఫిషియల్ నెయిల్స్‌తో కూడా గోర్లకు హాని చేకూరుతుంది.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్
ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. ఇన్‌ఫెక్షన్ తొలి లక్షణం గోర్లపై తెల్లటి మచ్చలు రావడమే. అంతేకాదు..ఇన్‌ఫెక్షన్ పెరిగితే..గోర్లు లావుగా, డ్రైగా మారతాయి. అందుకే గోర్లపై తెల్లటి మచ్చలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
గోర్లకు గాయం
చాలా సందర్బాల్లో గోర్లకు దెబ్బలు తగులుతుంటాయి. దెబ్బ తగిలిన 3 వారాల తరువాత గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. అందుకే నిర్లక్ష్యం చేయకూడదు.
మినరల్స్ లోపం
శరీరంలో మినరల్స్ లేదా విటమిన్ల లోపముంటే గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. జింక్ లేదా కాల్షియం లోపంతో సాధారణంగా ఇలాంటి మచ్చలు కన్పిస్తుంటాయి. ఇలాంటి మచ్చల్ని తొలగించేందుకు యాంటీ ఫంగల్ మందులు వాడాలి. రక్తంలో ఎలాంటి సమస్య తలెత్తినా వైద్యుడిని సంప్రదించాలి. కాస్మోటిక్స్ ఎక్కువగా వాడకూడదు.
Also read: Weight Gain Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా వేగంగా బరువు పెరగవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Nail White Marks: గోర్లపై తెల్లటి మచ్చలు..ఆ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు